Agent On OTT అఖిల్ డిజాస్టర్ మూవీ ఓటీటీలో.. ఏజెంట్ మూవీ ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా క్రియేటివ్ డైరెక్గర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ఏజెంట్. రిలీజ్‌కు ముందే అనేక సమస్యలను, అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చిత్రం విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తాకొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఒటీటీ రిలీజ్‌కు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయాల్లోకి వెళితే..
ఏజెంట్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే రకరకాల సమస్యలో కూరుకుపోయింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల మేర జరిగింది. దాదాపు 80 కోట్ల గ్రాస్, 40 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించిన ఈ చిత్రం 1150 స్క్రీన్లలో రిలీజైంది.

ఏజెంట్ సినిమా తొలి ఆట నుంచే ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ విమర్శకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ జోన్‌లోకి వెళ్లింది.దాంతో భారీ తడబాటుతో థియేట్రికల్ రన్ కొనసాగింది. అయితే నెగిటివ్ జోన్ నుంచి పాజిటివ్ జోన్‌లోకి రాలేక డిజాస్టర్‌గా మారింది.
ఏజెంట్ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో తొలి రోజు అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమా తొలి రోజు 8 కోట్లకుపైగా గ్రాస్, 5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత అదే జోష్‌ను కొనసాగించలేకపోయింది. చివరకు 13 కోట్ల గ్రాస్, 7 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో దాదాపు 30 కోట్లకుపైగా థియేట్రికల్ నష్టంతో బాక్సాఫీస్ యాత్రను ముగించింది.
అయితే తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ రావడంతో ఏజెంట్ సినిమా ఓటీటీ బిజినెస్ పరంగా సమస్యలను ఎదుర్కొన్నది. అయితే పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాను తీసుకోవడానికి వెనుకంజ వేశాయి. దాంతో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సోని లివ్ (Sony Liv) సొంతం చేసుకొన్నది. ఈ మూవీని జనవరి చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా జనవరి 27 తేదీన స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది అని ఓటీటీ ట్రేడర్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications











