Bigg Boss Telugu 6 ఆ కంటెస్టెంట్లు షోలో ఉన్నారా? టాప్ 5 కి వెళ్లేది వీరే.. అఖిల్ సార్థక్ జోస్యం
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో ఇప్పుడిప్పుడే ఊపందుకొన్నట్టు కనిపిస్తున్నది. గత 9 రోజులుగా చప్పగా సాగుతూ.. కొందరు కంటెస్టెంట్లు ఇంకా గుర్తింపుకు నోచుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండోవారం కెప్టెన్సీ టాస్క్ కొంత ఆసక్తిని కలిగించింది. రేవంత్, గీతూ రాయల్, జబర్దస్త్ ఫైమా లాంటి కంటెస్టెంట్లు వినోదాత్మకమైన కంటెంట్‌ను అందించారు. అయితే తాజా సీజన్ గురించి బీబీ కేఫేలో బిగ్‌బాస్ తెలుగు రన్నర్ అఖిల్ సార్థక్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరి ఏమన్నారంటే..

అరియానా బీబీ కేఫేతో
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 కోసం నిర్వాహకులు బీబీ కేఫ్ అనే కొత్త షోను అరియానా గ్లోరితో ప్రారంభించారు. ప్రతీ రోజు జరిగే ఆటపై అరియానా గ్లోరి రివ్యూ ఇస్తారు. ఈ షోలో ప్రతీ రోజు ఒక సెలబ్రిటీ, కొందరు ఆడియెన్స్‌తో మాట్లాడి అభిప్రాయాలను సేకరిస్తారు. గత వారం రోజుల్లో సోయల్ ర్యాన్ సయ్యద్, ఆర్జే కాజల్, శివ జ్యోతి, అఖిల్ సార్థక్ వచ్చారు. ఈ షో డిస్నీ హాట్ స్టార్‌లో బిగ్ బాస్ తెలుగు కేటగిరిలో స్ట్రీమింగ్ అవుతున్నది.

అరియానాతో అఖిల్ సార్థక్
అయితే తాజాగా అఖిల్ సార్థక్, అరియానా గ్లోరి ఇటీవల జరిగిన నామినేషన్ ప్రక్రియపై చర్చించారు. అయితే కంటెస్టెంట్లు సరిగా ఆడటం లేదు. ఎవరు ఉన్నారో ఎవరు లేరో అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కొందరు కంటెస్టెంట్లు అసలు కనిపించడం లేదు. కనీసం కంటెంట్ కూడా ఇవ్వని వారు ఉన్నారు. నాలాంటి వారికే కంటెస్టెంట్ల పేర్లు తెలియడం లేదు. వాసంతి షోలో ఉందా అని అఖిల్ సార్థక్ అన్నారు.

నామినేషన్స్‌ను చాలా తేలికగా
నామినేషన్ ప్రక్రియ అంటే క్వాలిటీ పాయింట్స్ ఉండాలి. కానీ తాజా సీజన్‌లో అసలు పాయింట్ లేకుండా సిల్లీగా నామినేట్ చేస్తున్నారు. కొందరైతే ఎందుకు నామినేట్ చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఎవరైనా ఆరోపణలు చేస్తే వాదన చేయడం లేదు. కొందరైతే దానిని అంగీకరిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నామినేషన్స్ చాలా తేలికగా తీసుకొంటున్నారు అని అఖిల్ సార్థక్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

అఖిల్ సార్థక్ టాప్ 5 లిస్ట్
ప్రస్తుత పరిస్థితులు, తన అంచనా ప్రకారం టాప్ 5లో ఎవరు ఉంటారనే విషయాన్ని అఖిల్ సార్థక్ చెప్పాడు. రేవంత్, శ్రీహాన్, సుదీప, రోహిత్ అండ్ మెరీనా, ఫైమా, టాప్ 5లో ఉండటానికి అవకాశం ఉంది అని అఖిల్ సార్థక్ చెప్పారు. రోహిత్, మరీనా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. వారు కరెక్ట్‌గా ఆడితే వారు టాప్ 5కి చేరడానికి అవకాశం ఉందన్నారు. అయితే టాప్ 5 కంటెస్టెంట్ ఎవరనేది ఈ స్టేజ్‌లో ఊహించడం కొంత తొందరపాటు తనమే అవుతుందని అన్నారు.

నామినేషన్‌లో ఈ వారం ఎవరంటే?
బిగ్‌బాస్ రియాలిటీ షోలో రెండో వారం కూడా మొత్తం 21 మంది గేమ్ ఆడుతున్నారు. తొలి వారం ఎలిమినేషన్ లేకపొవడంతో మొత్తం సభ్యులు ఇంటిలో ఉన్నారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 6 షో రెండో వారంలో మొత్తం ఎనిమిది నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారిలొ సింగర్ రేవంత్, జబర్దస్త్ ఫైమా, మెరీనా అండ్ రోహిత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్, రాజశేఖర్, షానీ సాల్మన్ ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











