For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోనాల్‌ గజ్జర్‌, అఖిల్ సార్థక్ మధ్య ఏం జరిగింది? కలకలం రేపుతోన్న బిగ్ బాస్ రన్నర్ పోస్ట్

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాక్టర్ మారి.. ఎన్నో సినిమాలు, సీరియళ్లలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ గాయ్ అఖిల్ సార్థక్. ఇండస్ట్రీలో కొనసాగినా దక్కని పాపులారిటీని అతడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇక, ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి వచ్చినా మరోసారి నిరాశనే ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు లవ్ రిలేషన్‌షిప్ గురించి చేసిన కామెంట్ చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలపై మీరూ లుక్కేయండి!

  అఖిల్ అలాగ.. మోనాల్ ఇలాగ

  అఖిల్ అలాగ.. మోనాల్ ఇలాగ

  మోడల్‌గానే అఖిల్ ఫుల్ పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్‌మెన్‌గా పలుమార్లు ఎంపికయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఛాన్స్ పట్టేశాడు. మరోవైపు, అప్పుడెప్పుడో మోనాల్ గజ్జర్ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చింది. తర్వాత చాలా భాషల్లో నటించిన ఈమె కూడా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది.

  హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

  లవ్ ట్రాకుతో ఫేమస్.. రొమాన్స్‌

  లవ్ ట్రాకుతో ఫేమస్.. రొమాన్స్‌

  వ్యక్తిగతంగా తమ సామర్ధ్యాలను నిరూపించుకునే బిగ్ బాస్ షోలో మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ జంటగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడూ కలిసే ఉంటూ.. కలిసే ఆడుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు హైలైట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో తరచూ రొమాన్స్ చేయడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమ పక్షులే అని అందరూ డిసైడ్ అయిపోయారు.

  ఇద్దరూ సత్తా.. చివర్లో నిరాశగానే

  ఇద్దరూ సత్తా.. చివర్లో నిరాశగానే

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ కంటెస్టెంట్లుగా ప్రవేశించారు. ఎవరూ ఊహించని రీతిలో ఇద్దరూ తమ ఆటతీరును కనబరిచారు. ఫలితంగా ఈ ఇద్దరూ చివరి వరకూ ఉన్నారు. అయితే, వీళ్లిద్దరిలో మోనాల్ పద్నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ, అఖిల్ మాత్రం ఫినాలేకు చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు.

  Pakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలా

  హౌస్‌లోనే కాదు.. బయటా రచ్చే

  హౌస్‌లోనే కాదు.. బయటా రచ్చే

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు జంటగా తెగ సందడి చేసిన మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే కనిపించారు. కలిసి పార్టీలు చేసుకోవడం.. పబ్‌లకు వెళ్లడం.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం.. ఒకరి గురించి మరొకరు పోస్టులు చేసుకోవడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలిచేవారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

  నాన్ స్టాప్ ఛాన్స్.. మళ్లీ రన్నరే

  నాన్ స్టాప్ ఛాన్స్.. మళ్లీ రన్నరే

  ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అఖిల్ సార్థక్ కూడా కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఇందులో గతంలో కంటే చక్కని ఆటతీరును కనబరిచిన అతడు.. తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఇలా ఎన్నో అంచనాలతో ఫినాలేలో అడుగు పెట్టాడు. కానీ, తుది మెట్టుపై మరోసారి బోల్తాపడి రన్నర్‌గా మిగిలాడు. ఇందులో బిందు మాధవి విజేతగా నిలిచింది.

  శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

  అఖిల్ సార్థక్ పోస్ట్‌తో కలకలం

  అఖిల్ సార్థక్ పోస్ట్‌తో కలకలం

  అఖిల్ సార్థక్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆస్క్ మీ (ASK ME) సెషన్ నిర్వహించాడు. ఇందులో ఓ నెటిజన్ 'రిలేషన్‌షిప్‌ మీద మీ అభిప్రాయం ఏంటి' ప్రశ్నించాడు. దీనికి అఖిల్ తన లవ్ బ్రేకప్ అయినట్లు సింబల్స్ పెట్టి 'ఇదీ మేటర్' అని కామెంట్ చేశాడు.

  ఆమెతో అఖిల్ విడిపోయాడా?

  ఆమెతో అఖిల్ విడిపోయాడా?

  బిగ్ బాన్ సాన్ స్టాప్ సీజన్‌లో ఉన్న సమయంలోనూ అఖిల్ సార్థక్.. తరచూ మోనాల్ గజ్జర్ గురించి ప్రస్తావించేవాడు. దీంతో వీళ్ల మధ్య ట్రాక్ కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పుడు అతడు చేసిన కామెంట్‌తో మోనాల్‌తో అఖిల్ బ్రేకప్ చేసుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Bigg Boss Fame Akhil Sarthak Relationship with Monal Gajjar Since Long Time. Now He Did Unexpected Comments on Relationship.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X