OTTలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఇండియా వైడ్‌గా నంబర్ 1 స్థానంలో..!

యువ సామ్రాట్‌ నాగ చైతన్య మొదటి వెబ్‌ సిరీస్‌ ధూత ఓటీటీలో రిలీజ్ అయి దుమ్మురేపుతోంది. నవంబర్ 30 నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్... నేషనల్ వైడ్ గా దూసుకుపోతుంది. ఇక ఈ సీరిస్ తో అక్కినేని ఫ్యాన్స్ కు అయితే నాగచైతన్య ఆకలితీర్చాడు. అయితే ఈ సాలీడ్ థ్రిల్లర్ రెస్పాన్స్ పై నాగ చైతన్య తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అక్కినేని నాగచైతన్యకు హిట్ పడక చాలా కాలమే అయింది. ఆయనకు ఓ సాలిడ్ హిట్ పడితే.. అభిమానులు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే నాగచైతన్య మొట్టసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో మనం, థ్యాంక్యూ లాంటి సినిమాలను తెరకెక్కించిన కె. విక్రమ్‌ కుమార్‌ దూత వెబ్ సిరీస్‌ కు దర్శకత్వం వహించాడు. చైతూతో పాటు ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

Akkineni Naga Chaitanya Dhootha web series ranked number 1 India wide In Amazon Prime Video OTT

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో దూత వెబ్ సిరీస్‌ నవంబర్ 30 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల నిడివితో ఉండగా... దూత వెబ్‌ సిరీస్‌ ఆధ్యంతం ఆసక్తి కలిగిస్తూ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో ముఖ్యంగా నాగ చైతన్య ఇంటెన్స్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఓటీటీలో హార్రర్‌, థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతోందనే విషయం తెలిసిందే. కాబట్టి ఓటీటీ ప్రియులకు దూత కూడా మంచి ఛాయిస్‌ అయింది. ప్రముఖ నిర్మాత శరద్‌ మరార్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఈ దూత వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్ కు ఇషాన్ చబ్రా సంగీతం అందించారు.ఇక ఈ సిరీస్ కోసం నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధికంగా రూ. 45 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

దూత వెబ్ సిరీస్ రిలీజ్ అయి నెలలు దాటుతున్న కానీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. అంతే కాకుండా ప్రైమ్ వీడియోలో చాలా రోజులు పాటుగా ట్రెండింగ్ లో నిలిచింది. ఇండియా వైడ్ గా నంబర్ 1గా నిలిచిన ఈ చిత్రం... ఆర్మాక్స్ లో కూడా ఇండియా వైడ్ గా నెంబర్ 1 సిరీస్ గా ట్రెండింగ్ అవుతుంది. 2023లో ది బెస్ట్ సిరీస్ గా నాగ చైతన్య ధూత నిలిచింది.

Akkineni Naga Chaitanya Dhootha web series ranked number 1 India wide In Amazon Prime Video OTT

దీనితో ఈ హ్యాపీ మూమెంట్ పై నాగ చైతన్య స్పందించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మిడియా వేదికగా షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే దూత హవా మాత్రం ఓటిటిలో గట్టిగా ఉంది. మీరు గనుక ఈ సినిమా సిరీస్ ను మిస్ అయితే.. చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X