Dootha Web Series: ఓటీటీలోకి నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
జోష్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని కుటుంబ వారసుడిగానే సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈయన.. డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అరంగ్రేటం చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయన ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలిసనప్పటి నుంచి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తనతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, నాగ చైతన్య కాంబోలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చాలా కాలం క్రితమే ప్రకటించారు. కానీ అటు డైరెక్టర్ కు, ఇటు హీరోకు వేరే కమిట్ మెంట్లు ఉండడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ పూర్తి అయింది. అయితే దీనికి దూత అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఒక్క నాగ చైతన్యకు మాత్రమే కాదు ఇది మొదటి వెబ్ సిరీస్ కాదు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందిస్తున్న తొలి తెలుగు వెబ్ సిరీస్ కూడా ఇదే.

అయితే దూత వెబ్ సిరీస్ రాబోతున్నట్లు ప్రకించిన తర్వాత మళ్లీ ప్రైమ్ వీడియో నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ మధ్య నాగ చైతన్య దీని గురించి మాట్లాడాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిందని.. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఎందుకు ఆలస్యం చేస్తుందో తనకు తెలియదని ప్రకటించాడు. దూత వెబ్ సిరీస్ ను ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా వాళ్లే ప్రకటిస్తారని వివరించాడు. దీంతో అసలు ఈ వెబ్ సిరీస్ వస్తుందా, రాదా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ ఏడాది ఆగస్టులోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెస్ సిరీస్ ను విడుదల చేస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అది మాత్రం జరగలేదు. కానీ తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం.. డిసెంబర్ ఒకటో తేదీ నుంటి నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 ఎపిసోడ్లు కల్గిన ఈ వెబ్ సిరీస్ లో.. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంటుందట. అయితే ఈ వెబ్ సిరీస్ ను శరద్ మరార్.. ప్రైమ్ వీడియోతో కలిసి నిర్మించారు. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో దూత వెబ్ సిరీస్ ను తెరకెక్కించినట్లు సమాచారం.

ఈ వెబ్ సిరీస్ లో అక్కినేని నాగ చైతన్యతో పాటు పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పై నాగ చైతన్య భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. మరి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ఈ రేంజ్ లో ఓటీటీ ప్రియులను అలరిస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











