Thandel OTT Rights: నాగచైతన్య మూవీకి ఫ్యాన్సీ రేట్.. ప్రముఖ ఓటీటీకి తండేల్ రైట్స్!

అక్కినేని నాగ చైతన్య గురించి, ఆయన టాలెంట్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వరుస హిట్లు కొడుతూ... సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన కొన్ని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా... వరుస ప్రయోగాలు చేస్తున్నాడు. ఇటీవలే దూత వెబ్ సిరీస్ తో విపరీతమైన సక్సెస్ సాధించిన ఈయన మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ చిత్రమే తండేల్. అయితే సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'తండేల్' సినిమాలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవిలు హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. యల్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు. సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Akkineni Naga Chaitanya Thandel Movie OTT Partner and Streaming Date Revealed Check Details

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా.. నాగ చైతన్య లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఆయన సముద్రంలో చేపల వేట సాగించే తండేల్ రాజుగా కనిపించి మెస్మరైజ్ చేశాడు. బనియన్, లుంగీలో.. యాస కూడా కూడా మార్చగా.. అదిరిపోయాడు. అలాగే సాయి పల్లవి లుక్ కూడా సూపర్ గా ఉంది. ఇలా ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.

Akkineni Naga Chaitanya Thandel Movie OTT Partner and Streaming Date Revealed Check Details

అయితే ఈ చిత్రం విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ దక్కించుకుంది. భారీ ధరకే ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను భారీ పోటీ నడమ దక్కించుకుంది. ముఖ్యంగా రూ.40 కోట్లు చెల్లించి మరీ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X