OTTలోకి నాగార్జున నా సామిరంగ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఇటీవల నటించిన తాజా చిత్రం నా సామిరంగ. ఇక ఈ సినిమా ప్రముఖ కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీ.. తొలిసారిగా డైరెక్టర్ గా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తానికి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీరిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నాగార్జున సూపర్ హిట్ చిత్రం నా సామిరంగ ఏ ఓటీటీలో ఎప్పుడు, స్ట్రీమింగ్ కానుందో ఈ స్టోరీలో చూద్దాం.

అక్కినేని నాగార్జున ఈ సారి పండక్కి నా సామిరంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న ఈ సినిమా విడుదలయ్యింది. పండుగ వేళ ఆఖర్లో వచ్చిన సినిమా ఇదే అయినప్పటికీ... బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. నా సామిరంగా కన్నా ముందు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Akkineni Nagarjuna Naa Saami Ranga Streaming on Disney Plus Hotstar From Feb 15th Full Details Here

ఇక థియేటర్లోలో హనుమాన్, గుంటూరు కారం సినిమాలు దూసుకుపోతున్నా... నాగార్జున సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పర్వాలేదనిపించింది. మలయాళ రీమేక్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను బాగానే రాబట్టింది. మొదటి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లు సాధించి.. నాగార్జునకు మంచి జోష్ ను ఇచ్చింది. హనుమాన్‌ తర్వాత బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన సినిమాగా నా సామిరంగా నిలువగా... తాజాగా మేకర్స్.. సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారు.

ఇక నా సామిరంగ సినిమా ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతుంది. ఇక ఈ సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీ రిలీజ్ డేట్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 15వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Akkineni Nagarjuna Naa Saami Ranga Streaming on Disney Plus Hotstar From Feb 15th Full Details Here

ఇక ఈ సినిమా డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 25న స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయంపై అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా నాగార్జున సరసన అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది. ఇక జైలర్ నటి.. మీర్నా కూడా నటించింది. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ రావడంతో... నాగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మరోవైపు నాగార్జున నా సామిరంగ సక్సెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా సామిరంగ చేస్తున్నాను అంటే చాలా మంది నవ్వారని.. ఇంట్లో వాళ్లు కూడా నవ్వారని ఎమోషనల్ అయ్యారు. తాము మాత్రం కేవలం మూడు నెలల వ్యవధిలోనే నా సామిరంగా సినిమాను పూర్తి చేసి విడుదల చేశామని తెలిపారు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా ధనుష్ తో కలిసి ఓ సినిమాతో రాబోతున్నాడు నాగార్జున.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X