ఓటీటీలోకి అడల్డ్ కంటెంట్ మూవీ.. అక్షరగౌడ, కామాక్షి భాస్కర్ల, పూజా జవేరి మూవీ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అంటే?
ఓటీటీల ప్రభావం బాగా పెరిగిపోవడం.. సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో ఫిల్మ్ మేకర్స్ తాము ఏదైతే కథను, పాయింట్‌ను చెప్పాలనుకొంటున్నారో.. దానిని నేరుగా చెప్పేస్తున్నారు. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, క్రైమ్, హారర్ కథలతో భారీగా సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అలాంటి బోల్డ్ కథతో వస్తున్న చిత్రం మిక్స్ అప్. ఈ సినిమాకు ఆకాశ్ బిక్కి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా తిరుమల్ రెడ్డి అమిరెడ్డి వ్యవహరించారు. ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ అవుతున్నదంటే?
మితిమీరిన శృంగార దాహంతో ఉన్న ఒక అమ్మాయి, దాంపత్య జీవితంలో శృంగారమంటే ఇష్టం లేని యువతి జీవితాలకు సంబంధించిన కథనే మిక్స్ అప్. వైవాహిక జీవితంలో సెక్స్ సంబంధింత సమస్యలతో విసిగి వేసారని రెండు జంటలు సైకాలజిస్ట్, శృంగారపరమైన సమస్యలకు సమాధానం చెప్పే కన్సల్టెంట్‌ను సంప్రదిస్తారు. వారి జీవితంలో ఏం జరిగింది? వారి సమస్యలకు పరిష్కారం దొరికిందా అనేది చూడాలంటే.. మిక్స్ అప్ సినిమా చూడాల్సిందే.

దాంపత్య జీవితంలో శృంగారపరమైన ఇబ్బందుల బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో ఆదర్శ్ బాలకృష్ణన్, అక్షర గౌడ, కమల్ కామరాజ్, పూజా జవేరి, కామాక్షి తదితరులు నటించారు. అక్షర గౌడ, పూజా జవేరి ఎదుర్కొంటున్న సమస్యలను ట్రైలర్‌లో అంతకు మించి అనే విధంగా చూపించారు. అడల్డ్ కంటెంట్ మూవీపై బజ్ బాగానే క్రియేట్ అయిందనిపిస్తున్నది.
ఇక తెలుగులో పక్కా ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా ఒరిజినల్ మూవీగా రిలీజ్ అవుతున్నది. ఈ మూవీని మార్చి 15వ తేదీన స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ సినిమాను చూడాలంటే.. మీరు ఆహాలో నేరుగా చూసుకోవచ్చు. అడల్ట్ కంటెంట్ ఇష్టపడే వారికి మంచి మసాలా సినిమాగా కనిపిస్తున్నది.
నటీనటులు: ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజా జే జవేరి, కామాక్షి భాస్కర్ల తదితరులు
రచన: హైమా వర్షిణి
దర్శకత్వం: ఆకాశ్ బిక్కి
నిర్మాత: తిరుమల్ రెడ్డి అమిరెడ్డి
కో డైరెక్టర్: హేమంత్ దుర్గం
సినిమాటోగ్రఫి: దినేష్ కే బాబు
ఎడిటింగ్: సత్య
మ్యూజిక్: కౌశిక్
ఓటీటీ రిలీజ్: 2024-03-14
ఓటీటీ స్ట్రిమింగ్: ఆహా


Click it and Unblock the Notifications











