OTTలోకి రీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మరో సర్వైవల్ థ్రిల్లర్ రానుంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మిషన్ రాణిగంజ్... ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక. అక్టోబ‌ర్ 06న విడుద‌లైన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాలీవుడ్ లో ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అంటే అక్షయ్ కుమార్. ఇక ఈ హీరోకు వరుసగా ఫ్లాపులు ఎదురు అయ్యాయి. ఇటీవల ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్‌లో చాలా రోజుల‌కు హిట్ కొట్టాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్‌ తోనే ఇటీవల ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం మిషన్ రాణిగంజ్ అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాకు ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక పెట్టారు. ఈ ఉప శీర్షిక విషయంలో అప్పట్లో చర్చ కూడా జరిగింది.

Akshay Kumar Mission Raniganj Movie Going To Streaming on Netflix OTT From Dec 1st Full Details Here

మొదట ఈ సినిమాకు శీర్షికగా ది గ్రేట్ ఇండియా రెస్క్యూ అని ఉండేది. అయితే ఇండియా అనే పదం తీసేసి భారత్ అనే పదం పెట్టాలి అని కేంద్రం చెప్పడంతో.. గవర్నమెంటు కంటే ముందే అక్షయ్ కుమార్ జాగ్రత్త పడ్డాడు. వెంటనే తన సినిమా శీర్షిక మార్చుకున్నాడు. ఇక ఈ సినిమాలో అక్షయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించింది.

మిషన్ రాణిగంజ్ అక్టోబ‌ర్ 06న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌ గా నిలిచింది ఈ మూవీ. ఒకప్పుడు వంద కోట్లను అవలీలగా కొట్టేసిన అక్షయ్‌ కుమార్ మిషన్ రాణిగంజ్ సినిమా మాత్రం దారుణంగా ప్లాప్ అయింది. కనీసం బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద అప్పుడు పెద్ద సినిమాలు లేవు.. అయినా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది.

Akshay Kumar Mission Raniganj Movie Going To Streaming on Netflix OTT From Dec 1st Full Details Here

ఇదిలా ఉంటే.. తాజాగా మిషన్ రాణిగంజ్ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు డిసెంబ‌ర్ 01న నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. స్పెషల్ 26, రుస్తుం వంటి సినిమాలు తెరకెక్కించిన టీను సురేష్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను పూజా ఎంటర్‌ టైన్ మెంట్స్‌ తో కలిసి అక్షయ్‌ కుమార్‌ స్వీయ నిర్మాణంలో రూపొందించాడు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదోక సర్వైవల్ థ్రిల్లర్. 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్‌ లోని రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ఉన్న బొగ్గు గనుల్లో 64 మంది కార్మికులు చిక్కుకుంటారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. వారిని కాపాడడానికి అక్షయ్ ఎలాంటి సాహసాలు చేశాడనే కథాశంతంతో తెరకెక్కించారు. ఇక ఈ థ్రిల్లర్ ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X