ఓటీటీలోకి హై రేంజ్ యాక్షన్ మూవీ.. ఒళ్లు గగుర్పొడిచేలా చేసే దీన్ని ఎక్కడ చూడాలంటే!
సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరో అయినా వేగంగా సినిమాలు చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పాలి. కానీ, కొందరు మాత్రమే వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకడు. ఫలితాలతో సంబంధం లేకుండా ముందుకెళ్లే అతడు.. ఇటీవలే 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా చేశాడు.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'బడే మియాన్ చోటే మియాన్'. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా భారీ హైప్ నడుమ ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది.

భారీ అంచనాల నడుమ ఆడియెన్స్ ముందుకు వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి స్పందన ఆశించిన రీతిలో రాలేదు. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి ఫుల్ రన్‌లో రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు అయింది. దీంతో రూ. 350 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'బడే మియాన్ చోటే మియాన్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై అదిరిపోయే న్యూస్ రివీల్ అయింది.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్' మూవీ స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ జూన్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాను పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏఏజడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్‌షికా దేశ్‌ముఖ్ తదితరులు నిర్మించారు. ఇందులో మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, రోనిత్ రాయ్, ఆలయా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విశాల్ మిశ్రా, జూలియస్ ప్యాకియం మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











