ఓటీటీలోకి ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ మూవీ.. 350 కోట్ల ఈ సినిమాను ఎలా చూడాలంటే!
ఎన్నో జోనర్లలో సినిమాలు వచ్చినా యాక్షన్ జోనర్‌లో తెరకెక్కే చిత్రాలు మాత్రం మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఆ తరహా మూవీలు మరింత ఎక్కువగా రూపొందుతోన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అలా ఇటీవలే వచ్చిన సినిమానే 'బడే మియాన్ చోటే మియాన్'.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన హై రేంజ్ యాక్షన్ సినిమానే 'బడే మియాన్ చోటే మియాన్'. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా భారీ హైప్ నడుమ ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

ఎన్నో అంచనాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి ఫుల్ రన్‌లో రూ. 100 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది. దీంతో రూ. 350 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలింది.
పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'బడే మియాన్ చోటే మియాన్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ గురించి ఎన్నో ప్రచారాలు జరిగినా తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చింది.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన 'బడే మియాన్ చోటే మియాన్' మూవీ స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ నేటి నుంచే స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమాను హిందీలోనే కాకుండా తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చినట్లు సదరు సంస్థ ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాను పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏఏజడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్‌షికా దేశ్‌ముఖ్ తదితరులు నిర్మించారు. ఇందులో మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, రోనిత్ రాయ్, ఆలయా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విశాల్ మిశ్రా, జూలియస్ ప్యాకియం మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











