ఓటీటీలోకి 65 కోట్ల స్పోర్ట్స్ డ్రామా.. ఎప్పుడు? ఎక్కడ ఈ మూవీని చూడొచ్చంటే?
మలయాళంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అలప్పుల జింఖానా సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజై కేరళ బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ప్రేమలు ఫేమ్ నెల్సన్, లక్మణ్ అవరన్, గణపతి, షైన్ టామ్ ఛాకో, కొట్టాయం నజీర్ నటించారు. ఈ సినిమాకు ఖాలీద్ రెహ్మాన్ రచించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఖాలీద్ రెహ్మన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సబీష్ కన్నన్ చెర్రీ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను ముగించుకొని ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. ఈ సినిమా బడ్జెట్, సాధించిన కలెక్షన్లు, అలాగే ఓటీటీలో రిలీజ్ అవుతున్న డేట్ వివరాల్లోకి వెళితే..
అలప్పుల జింఖానా కథ విషయానికి వస్తే.. జోజో జాన్సన్ (నస్లేన్) ఓ కాలేజీ విద్యార్థి. తనకు నచ్చిన కాలేజీలోకి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ కావటానికి బాక్సింగ్‌లో చేరతాడు. తన స్నేహితులతో కలిసి కఠినమైన, అసలు బాక్సింగ్‌ను నేర్పించే కోచ్ ఆంటోనీ జోషువా (లుక్‌మాన్ అవరాన్)ను కలిసినప్పుడు. పట్టుదల, శ్రమ, బాక్సింగ్‌లో ఎదురయ్యే అనుభవాల గురించి హెచ్చరిస్తాడు. కానీ బాక్సింగ్‌లో ప్రొఫెషనల్‌గా మారేందుకు సిద్దపడుతాడు. తన కాలేజీ టీమ్ ప్రత్యర్థి, బలమైన జట్టు, అనేక మార్లు చాంపియన్‌గా నిలిచిన టీమ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తన జట్టును జోజో జాన్సన్ గెలిపించాడా? లేదా అనేది సినిమా కథ.

అలప్పుల జింఖానా సినిమాకు జిమిషి ఖాలీద్ సినిమాటోగ్రఫి, విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు నిషద్ యూసఫ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రిలీస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించాయి. ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 10 కోట్ల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మలయాళంలోను, సుమారుగా 2 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
అలప్పుల జింఖానా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఈ సినిమా 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, కేరళలో 38 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 60 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో ఇండియాలో 45.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 65.5 కోట్ల రూపాయలు రాట్టింది.
ఇలా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా క్రిటిక్స్‌ను కూడా ఇంప్రెస్ చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొన్నది. ట్రేడ్ అనలిస్టుల అంచనాలను మించి కలెక్షన్లు సాధించింది. తక్కువ బడ్జెట్‌తో చిన్న చిత్రంగా రూపొందిన ఈ సినిమా భారీ విజయం అందుకొన్నది. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్‌లో జూన్ 13వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. థియేటర్‌లో మిస్ అయిన వారు.. థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేసిన వారు.. మళ్లీ చూసేందుకు ఈ తేదీని గుర్తుంచుకొండి.. ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.


Click it and Unblock the Notifications











