OTTలోకి డైరెక్ట్​గా వచ్చేసిన ఇండియాలోని అతిపెద్ద రియల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడాలంటే?

ఓటీటీలో వచ్చే క్రైమ్ అండ్ యాక్షన్​ థ్రిల్లర్స్​కు స్పెషల ఫ్యాన్ బేస్ ఆడియెన్స్​ ఉంటారు. అందుకే ఈ జానర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ వీకెండ్ వచ్చిన నేపథ్యంలో స్పెషల్ సర్​ప్రైజ్​గా​ ఓ సూపర్ రియల్ ఇన్సిడెంట్​ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్​ను స్ట్రీమింగ్​కు వదిలారు. అది విడుదలైన కొన్ని గంటల నుంచే మంచి రెస్పాన్స్​ను అందుకోవడం ప్రారంభించింది. మరి ఇంతకీ ఆ సిరీస్​ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? వంటి వివరాలను తెలుసుకుందాం...

యదార్థ సంఘటనల ఆధారంగా..:రియల్ ఇన్సిండెంట్స్​ ఆధారంగా ఇప్పుడస్తున్న సినిమాలు, ముఖ్యంగా వెబ్ సిరీస్లు దాదాపుగా యదార్థ కథనాల ఆధారంగానే తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చేదే పోచర్ వెబ్ సిరీస్. ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రైమ్ రాకెట్‌ కథ అనే క్యాప్షన్‌తో... అభయారణ్యాలు, వన్య జీవుల ఆధారంగా ఈ వెబ్ సిరీస్​ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో అన్యాయంగా సాగే ఏనుగుల వేట చుట్టూ ఈ కథ సాగుతుంది.

Alia Bhatt Crime Thriller Poacher Web Series Streaming on Amazon Prime Video OTT Full Details Here

ఆ పోరాటలను కళ్లకు కట్టినట్లు...:కళ్లకు కట్టినట్లు చూపించారు కొన్నేళ్ల నుంచి అక్రమంగా, అతి కిరాతకంగా అడవుల్లో ఏనుగులను చంపడం, వాటితో ఇల్లీగల్ దందాలు చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ వంటి చేస్తున్నారు. ఇలాంటి స్మగ్లింగ్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీస్, ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఆ పోరాటలను ఏ మాత్ర మిస్ కాకుండా ఈ సిరీస్​లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా...:విమర్శకుల ప్రశంసలు నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, రంజితా మేనన్ సహా తదితురులు ఇందులో నటించారు. దిల్లీ క్రైమ్ లాంటి క్రైమ్ థ్రిల్లర్​ను అందించిన రిచీ మెహతానే దీనికి దర్శకత్వం వహించారు. ఈమె సక్సెస్​ ఫుల్​ ఎమ్మీ అవార్డు గ్రహీత కూడా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్​గా వ్యవహరించింది. ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్​ మొదలైంది.

Alia Bhatt Crime Thriller Poacher Web Series Streaming on Amazon Prime Video OTT Full Details Here

ఈ సిరీసులో ఆసక్తిగా 8 ఎపిసోడ్స్:ఈ సిరీస్‍లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. రీసెంట్​గా దీన్ని సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లోనూ ప్రదర్శించారు. ఇక్కడ ఈ థ్రిల్లర్​ సిరీస్​ అద్భుతమైన ఆదరణ దక్కింది. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. మరి థ్రిల్లర్, యాక్షన్ వెబ్ సిరీస్లు ఇష్టపడే మూవీ లవర్స్ ఉంటే ఈ వీకెండ్​లో పోచర్ వెబ్ సిరీస్ చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేయగలగుతారు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఈ సిరీస్​ను సరదాగా గడపండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X