ఎంగేజ్‌మెంట్ రింగ్ వెలకట్టలేనిది.. డైమండ్ ఉంగరం సీక్రెట్ అదే.. రణ్‌బీర్ ప్రపోజ్ ఎప్పుడంటే? ఆలియా

బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి జంటగా రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా సమాధానాలు చెప్పారు. అందరూ పెళ్లి తర్వాత మొదటి రోజు శృంగారంలో పాల్గొంటారని అనుకొంటారు. కానీ వివాహం తెచ్చిన అలసట వల్ల ఫస్ట్ నైట్ జరగదనే నాకు అర్ధం అయింది.

నేను అలిసిపోయి ఆ ఆ రాత్రి పడుకుండిపోయాను అని ఆలియా భట్ చెప్పారు. తనకు రణ్‌బీర్ కపూర్ ఎలా ప్రపోజ్ చేశాడు? ఎక్కడ చేశాడు? ఎంగేజ్‌మెంట్ రింగ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు ఆలియాభట్ చెబుతూ..

కెన్యాలో నాకు లవ్ ప్రపోజల్

కెన్యాలో నాకు లవ్ ప్రపోజల్

రణ్‌బీర్‌తో ముందు నాకు ఓ రిలేషన్ ఉండేది. అయితే ఒకరోజు కెన్యాలోని మాసై మారాలో నాకు రణ్‌బీర్ లవ్ ప్రపోజ్ చేశాడు. నాకు ప్రపోజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకోవడం, దానికి తగినట్టుగా నా ముందు ప్రేమను వ్యక్తం చేయడంతో నేను షాక్ తిన్నాను. ఎందుకంటే నేను ఆ విధంగా ఎన్నడూ ఊహించలేదు. నేను ఎప్పుడూ అనుకోలేదు అని ఆలియాభట్ తెలిపింది.

మా అఫైర్ గురించి ఎవరితో కూడా

మా అఫైర్ గురించి ఎవరితో కూడా

రణ్‌బీర్‌కు, నాకు మధ్య లవ్ గురించిన మాటలు వచ్చాయి. కానీ నేను అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ సడెన్‌గా ప్రపోజ్ చేయడంతో మనం ఎక్కువగా దీని గురించి మాట్లాడుకోవద్దు. ఈ ఫీలింగ్‌ను మనసులోనే కంటిన్యూ చేద్దామని చెప్పాను. అందుకు రణ్‌బీర్ కూడా సరే అన్నాడు. మా ప్రేమ గురించి ఎవరికీ పంచుకోలేదు అని ఆలియాభట్ చెప్పింది.

మాసై మారాలోని అందమైన ప్రదేశంలో

మాసై మారాలోని అందమైన ప్రదేశంలో

అయితే లవ్ ప్రపోజల్ తర్వాత నాకు రణ్‌బీర్ మరో షాక్ ఇచ్చాడు. కెన్యాలోని మాసై మారాలోని అందమైన ప్రదేశంలో ఓ ఉంగరాన్ని తెచ్చి నా వేలికి తొడిగాడు. ఆ స్పెషల్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఫోటోగ్రాఫర్‌ను సిద్దం చేసి.. మా ఫోటోలు తీయించాడు. జీవితంలో అది నాకు స్పెషల్ మూమెంట్. గొప్ప మధురానుభూతి అని ఆలియాభట్ చెప్పింది.

Mrs Hipster అనే కాన్సెప్ట్‌తో

Mrs Hipster అనే కాన్సెప్ట్‌తో

ఇక నా పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం రోజున నాకు రణ్‌బీర్ డైమండ్ రింగ్‌ను ఇచ్చాడు. అయితే అందమైన డైమండ్ రింగ్ కంటే.. ఆ ఉంగరంపై మా లవ్ గురించి తెలిపే ఓ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. మా ప్రేమ జీవితానికి సంబంధించిన ఫిలాసఫీని కనిపించేలా ఉంగరాన్ని డిజైన్ చేయించాడు. Mrs Hipster అని డైమండ్ రింగ్‌పై రాయించాడు. అందుకే ఎంగేజ్‌మెంట్ రింగ్ అనే నాకు చాలా ఇష్టం అని ఆలియాభట్ చెప్పింది.

దాని మీనింగ్ గురించి నేను చెప్పను

దాని మీనింగ్ గురించి నేను చెప్పను

నా ఎంగేజ్‌మెంట్ రింగ్‌పై ఉన్న Mrs Hipster అనే పదానికి సంబంధించిన ప్రతీ ఒక్క అక్షరానికి మీనింగ్ ఉంది. Mrs Hipster అంటే ఏమిటో నేను చెప్పను. నన్ను చెప్పమని బలవంతం చేయవద్దు. అది నాకు చాలా స్పెషల్ అని అలియాభట్ చెప్పింది. దాంతో మేము ఆ విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించం. నీ ప్రైవసీకి నేను భంగం కలిగించను అని కరణ్ జోహర్ చెప్పారు.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
ప్రెగ్నెన్సీ ప్రకటనతో ఆలియా భట్

ప్రెగ్నెన్సీ ప్రకటనతో ఆలియా భట్

ఇదిలా ఉండగా, ఆలియాభట్ ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటన చేసింది. త్వరలోనే ఆలియా మాతృత్వపు అనుభూతిని పొందడానికి సిద్దమవుతున్నది. ఆలియా గర్బవతి అనే విషయంతో కపూర్, భట్ ఫ్యామిలీలు చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలోనే చిన్నారి అందించబోయే ఆలియాభట్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X