OTT release this week.. ఓటీటీలో ఆలియాభట్, తాప్సీ మూవీస్ సందడి.. ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సీరిస్‌ల వివరాలు

వెండితెర మీద ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఓటీటీ ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని పంచేందుకు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్దమయ్యాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న చిత్రాల్లో ఆలియాభట్, తాప్సీ పన్ను నటించిన మూవీస్ ఉండటం విశేషంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి టాక్ సంపాదించుకొన్న ఈ చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..

గంగూభాయ్ కతియావాడి మూవీ

గంగూభాయ్ కతియావాడి మూవీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో వచ్చిన గంగూభాయ్ కతియావాడి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయిన ఈ చిత్రాన్ని నెట్‌‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు అందించారు. దేశంలోనే అతిపెద్ద వేశ్యవాటిక కామటిపుర నుంచి ముంబై రాజకీయాలను శాసించిన వేశ్య జీవితాన్ని ఈ సినిమాగా తెరకెక్కించారు.

ఓటీటీలో తాప్సీ పన్ను నటించిన మూవీ

ఓటీటీలో తాప్సీ పన్ను నటించిన మూవీ

ఓటీటీలో ఈ వారం రిలీజ్‌ అవుతున్న చిత్రాల్లో మిషన్ ఇంపాజిబుల్ ఒకటి. తాప్సీ పొన్ను ఈ సినిమాలో లీడ్ యాక్టర్‌గా నటించారు. ముగ్గురు బాల నటుల పాత్రలు ఈ సినిమాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సినిమాకు స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

నెట్‌ఫ్లిక్స్‌లో 365 days: This time

నెట్‌ఫ్లిక్స్‌లో 365 days: This time

అలాగే ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అవుతున్న చిత్రాల్లో 365 డేస్: దిస్ డే చిత్రం కూడా ఒటీటీలో అందుబాటులోకి వచ్చింది. వైవాహిక బంధాలు కథా నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. ఈ ఆంగ్ల సినిమాకు బార్బారా బియాలోవాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

ఇటాలియన్ క్రైమ్ వెబ్ సిరీస్

ఇటాలియన్ క్రైమ్ వెబ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల రిలీజైన చిత్రం బ్యాంగ్ బ్యాంగ్ బేబీ చిత్రం. ఇటాలియన్ క్రైమ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి మైఖేల్ అల్హానిక్ దర్శకత్వం వహించారు. మాఫియా నేపథ్యంలో తండ్రి కూతుళ్ల బంధంగా ఈ వెబ్ సీరిస్ తెరకెక్కింది.

ఓజార్క్ S4 మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓజార్క్ S4 మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో హాలే బెర్రీ, పాట్రిక్ విల్సన్ నటించిన మూన్ ఫాల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమింగ్ అవుతున్నది. అలాగే ఓజార్క్ S4 మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X