రణ్‌బీర్‌తో ఫస్ట్ నైట్ అనుభవం.. శోభనం రాత్రి ఏం జరిగిందంటే.. కరణ్ జోహర్ షోలో ఆలియాభట్
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఘనంగా ప్రారంభమైంది. డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో ఈ షో అట్టహాసంగా ప్రసారమైంది. సీజన్ 7 షోలో బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలియా భట్ జీవితానికి సంబంధించిన విషయాలు, ఆలియాతో రణ్‌వీర్ సింగ్ ఫ్రెండ్ షిప్ తదితర అంశాలు కరణ్ జోహర్‌తో పంచుకొన్నారు. కాఫీ విత్ కరణ్ షోలో జరిగిన ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ సందర్భంగా ఆలియా భట్ సమాధానాలు చెబుతూ..
Photo Courtesy by Disney+Hotstar Aapp

రణ్‌వీర్ సింగ్‌తో కాదు.. వరుణ్ ధావన్‌తో కెమిస్ట్రీ
రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్‌లో ఎవరితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇది చాలా టఫ్ క్వశ్చన్. నేను చెప్పే సమాధానం వరుణ్ ఫ్యాన్స్‌కు కష్టంగా ఉంటుందేమో. అయితే రణ్‌వీర్ సింగ్‌తో కెమిస్ట్రీ ఒకే. కానీ ఓవరాల్‌గా వరుణ్ ధావన్‌తోనే నా కెమిస్ట్రీ బాగుంటుంది అని ఆలియా సమాధానం చెప్పింది. అయితే తనతో కెమిస్ట్రీ బాగుండదు అని చెప్పగానే.. షో నుంచి వెళ్లిపోవడానికి రణ్ వీర్ లేచాడు. కానీ కరణ్ వారించడంతో వెనుకకు వచ్చి.. స్నేహం పేరుకే కళంకం తెచ్చావు అని ఆలియాభట్‌పై రణ్‌వీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రణ్ బీర్ మాజీ ప్రియురాళ్లతో
రణ్‌బీర్ కపూర్‌తో మాజీ ప్రియురాళ్లతో నాకు మంచి స్నేహం ఉంది. నేను వారితో మంచిగానే ఉంటా... వారు నాతో కూడా బాగానే ఉంటారు. రణ్‌బీర్ మాజీలతో నాకు ఎలాంటి కలహాలు లేవు అని చెప్పింది. రణ్‌వీర్ సింగ్ కంటే రణ్‌బీర్ మంచి డ్యాన్సర్ అని చెప్పింది. దాంతో రణ్‌వీర్ కాస్త నిరాశకు గురయ్యాడు. అయితే నాకు ఇటీవల బాగా నచ్చిన నటుడు రణ్‌వీర్ సింగ్. 83 సినిమాలో అతడి ఫెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. మిమి సినిమాలో కృతిసనన్ యాక్టింగ్ నచ్చింది అని ఆలియాభట్ చెప్పింది.

గంగూభాయ్ పాత్ర గురించి
సంజయ్ లీలా భన్సాలీలో ఏం మార్పు కోరుకొంటున్నావు అని కరణ్ జోహర్ అడిగితే.. అతడిలో ఎలాంటి మార్పు అవసరం లేదు. ఎందుకంటే.. అతడే నన్ను పూర్తిగా మార్చేశాడు. గంగూభాయ్ కతియావాడి సినిమాలో నటించిన తర్వాత ఇబ్రహిం ఖాన్ నుంచి నాకు వచ్చిన మంచి ప్రశంస వచ్చింది. గంగూ పాత్రలో అద్బుతంగా నటించావు. చాలా సులభంగా పాత్రలోకి ఒదిగిపోయావు అని ఆలియాభట్ తెలిపింది.

రణ్‌బీర్‌తో పెళ్లికి ముందు ఏం జరిగిందంటే?
రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లికి ముందు చివరి గంట ముందు ఏం జరిగింది అని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. మా ఇంటిలోనే పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాను. నా కోరిక ప్రకారమే రణ్‌బీర్ ఇంటిలోనే పెళ్లి జరిగింది. అయితే పెళ్లికి ముందు మేమిద్దరం బాల్కనీలో కూర్చొని భోజనం చేశాం. భోజనం చేసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొన్నాం. మా జీవితంలో బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ రిలేషన్‌కు గుడ్ బై చెప్పుకొన్నాం. ఇక నుంచి బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ ఉండదని నిర్ణయించుకొన్నాం అని ఆలియా భట్ చెప్పింది.

నేను ఆలియా భట్‌గానే ఉంటా
పెళ్లి తర్వాత నా పేరు మారలేదు. నేను ఆలియాభట్ గానే ఉన్నాను. ఆలియా కపూర్ అని పేరు మార్చుకోలేదు. అలాగని నేను ఆలియా భట్ కపూర్ అని కూడా చెప్పుకోలేదు. పెళ్లి తర్వాత నేను నాలాగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. పేరు మార్పుతో ఏం జరుగుతుంది అని ఆలియా అంటే.. ఒకసారి కెమెరాను చూసి ఓసారి నేను ఆలియా భట్ కపూర్ అని చెప్పు ఎలా ఉంటుందో అని రణ్‌వీర్ సింగ్ కవ్వించాడు. దాంతో నేను ఆలియాభట్ కపూర్ అని కెమెరాకు చెప్పిం

వంటలపై ఫోకస్ పెట్టాను
పెళ్లి తర్వాత చేయడం ఎలా అనే విషయంపై నేను బాగా ఫోకస్ చేస్తున్నాను. యూట్యూబ్, సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఎలా వంట చేస్తారనే విషయాన్ని పరిశీలిస్తున్నాను. రెండు నిమిషాల వ్యవధిలో ఒక వంటను ఎలా చేస్తారు. ఎలా కాయగూరలు, ఇతర వస్తువులను కట్ చేస్తారు. ఎలా వంట చేస్తారనే విషయాన్ని నేను ఫాస్ట్‌గా చూసి నేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నాను అని ఆలియా భట్ చెప్పారు.

పెళ్లి తర్వాత భ్రమలు అలా తొలిగాయి అంటూ
వివాహం తర్వాత నీకు తొలిగిన భ్రమలు ఏమిటని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు.. పెళ్లి తర్వాత నాకు కొన్ని భ్రమలు తొలిగిపోయాయి. శోభనం రాత్రి అంటే ఫస్ట్ నైట్ అందరూ సెక్స్ చేసుకొంటారు అనేది అందరికి తెలుసు. కానీ నా ఫస్ట్ నైట్ రోజున అలా సెక్స్ దంపతులు మధ్య జరగదు అనేది తేలిపోయింది. ఎందుకంటే పెళ్లి పనులు, ఇతర కార్యక్రమాలతో దంపతులు తీవ్రంగా అలసిపోతారు. నేను కూడా అలానే అలిసిపోయాను. నా శోభనం రాత్రి అలాంటి పని జరగలేదు. రణ్‌వీర్ సింగ్ విషయంలో అలా జరగకపోవచ్చు అని ఆలియాభట్ తన ఫస్ట్ నైట్ అనుభవం గురించి షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











