ఒకేసారి రెండు ఓటీటీల్లో నరేష్ మూవీ.. నెల కూడా కాకముందే వచ్చేస్తుందిగా!

బడా డైరెక్టర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. మొదట్లో కామెడీ జోనర్‌కే జై కొట్టిన అతడు.. కొంత కాలంగా విభిన్నమైన సినిమాలు చేస్తోన్నాడు. కానీ, సక్సెస్ ట్రాక్‌ను మాత్రం కంటిన్యూ చేయడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ చేశాడు.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్‌తో మల్లి అంకం తెరకెక్కించిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే అంచనాలను భారీగా పెంచుకుంది. ఇలా ఈ చిత్రం ఎంతో హైప్ నడుమ మే 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie Streaming On Aha and Amazon Prime

ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, మొదటి వీకెండ్‌లో ఈ చిత్రం సత్తా చాటుకుంది. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా డౌన్ అవుతూ వచ్చింది. ఇలా మొదటి వారంలో రూ. 6 కోట్లు వరకూ గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది.

యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం రెండు ఓటీటీలో భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పాయని టాక్.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie Streaming On Aha and Amazon Prime

నరేష్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా స్ట్రీమింగ్ గురించి కూడా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీన్ని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని తాజాగా తెలిసింది. అంటే మే 3వ తేదీన విడుదలైన ఈ సినిమా జూన్ మొదటి వారంలోనే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు. గోపీ సుందర్ దీనికి సంగీతాన్ని అందించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X