నెలలోపే ఓటీటీలోకి ఆ ఒక్కటీ అడక్కు.. ఎందులో వస్తుంది అనే దానిపై మాత్రం ట్విస్ట్
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే కామెడీ జోనర్‌లో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఒకడు. ఈ మధ్యన అతడు సీరియస్ చిత్రాలు చేస్తున్నాడు. కానీ హిట్లను అందుకోవడం లేదు. దీంతో ఈ సారి సక్సెస్ కావాలన్న లక్ష్యంతో 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ చేశాడు.
అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం రూపొందించిన క్రేజీ సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా విడుదలకు ముందే అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. ఇలా ఈ చిత్రం ఎంతో హైప్ నడుమ మే 3వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, మొదటి వీకెండ్‌లో ఈ చిత్రం సత్తా చాటింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే రన్‌ను ముగించింది. దీంతో అల్లరి నరేష్ ఖాతాలో మరో పరాజయం వచ్చి చేరినట్లు అయింది.
నవ్వించే కాన్సెప్టుతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇది భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పిందని తెలుస్తోంది. ఈ హక్కులను ఆహా కూడా తీసుకున్నట్లు ప్రచారం జరిగినా అది పుకారే అని అంటున్నారు.

నరేష్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కాకపోవడంతో దీన్ని నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని మే 31వ తేదీ నుంచి అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై ఈ రెండు రోజుల్లో ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు. గోపీ సుందర్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











