సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ ఒక్కటీ అడక్కు.. కడుపుబ్బా నవ్వించే ఇది ఎందులో ఉందంటే!

టాలీవుడ్‌లోని హీరోలు అందరికీ ప్రత్యేకమైన శైలి ఉంది. అలా కామెడీ జోనర్‌లో సినిమాలు చేసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అందులో అల్లరి నరేష్ ఒకడు. సుదీర్ఘ కాలంగా కామెడీ చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య సీరియస్ మూవీలు చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మళ్లీ హిట్ కొట్టాలన్న లక్ష్యంతో కామెడీ జోనర్‌లో నరేష్ 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ చేశాడు.

టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్‌‌తో మల్లి అంకం రూపొందించిన కామెడీ మూవీనే 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. ఫలితంగా విడుదలకు ముందే అంచనాలను భారీగా ఏర్పరచుకుంది. ఇలా ఈ చిత్రం ఎంతో హైప్ మధ్యన మే 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie Streaming Started On Amazon Prime

కామెడీ జోనర్‌లో తెరకెక్కిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, మొదటి వీకెండ్‌లో ఈ చిత్రం మంచి ప్రదర్శన చేసింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా డౌన్ అయిపోయింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ఇది రన్ ముగించాల్సి వచ్చింది. దీంతో అల్లరి నరేష్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

నరేష్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇది భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పిందని తెలుస్తోంది. కానీ, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై సదరు సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie Streaming Started On Amazon Prime

క్రేజీ కామెడీతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కాకపోవడంతో దీన్ని నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని తాజాగా అమెజాన్ సంస్థ ఈ అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. దీంతో థియేటర్లలో మిస్సైన వాళ్లంతా దీనికోసం ఎగబడుతున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు. గోపీ సుందర్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X