Ugram OTT 240 దేశాల్లో ఉగ్రం ఓటీటీ రిలీజ్.. అమెజాన్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

నాందితో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న విజయ్ కనకమేడల దర్శకుడిగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ఉగ్రం. తన ఇమేజ్‌కు భిన్నంగా పోలీస్ ఆఫీసర్‌గా అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.

అయితే ఈ చిత్రం బాక్పాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ఇటీవల ముగించుకొన్నది. దాంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారా మరింత చేరువగా చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్దమైంది. ఉగ్రం సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అమెజాన్ ప్రకటన జారీ చేస్తూ..

Allari Nareshs Ugram movie set to stream in Amazon Prime Video from June 2

ఉగ్రం సినిమా విషయానికి వస్తే.. అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితష్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నరేష్ సిన్సియర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీఐ శివకుమార్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. సీఐ శివకుమార్ దూకుడు కారణంగా ఆయన భార్య, కూతురుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని శివకుమార్ ఎలా పరిష్కరించి.. తన కుటుంబానికి ఊరట కలిగించాడు అనేది ఈ సినిమా కథ.

సమాజంలో జరుగుతున్న కొన్ని సమస్యలను ఆధారంగా చేసుకొని కథలు రాసుకొంటూ బాధ్యతాయుతమైన డైరెక్టర్‌గా సినిమాలు తీస్తున్నాను. నరేష్ విలక్షణమైన నటుడు. ఉగ్రం సినిమా కోసం ఆయన ఫెర్ఫార్మెన్స్ ఇంటెన్స్, ఫియర్‌పుల్‌గా ఉంది. తన నటనతో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నాడు. థియేటర్‌లో ఎంతో మందిని మెప్పించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్దమైంది అని విజయ్ కనకమేడల అన్నారు.

Allari Nareshs Ugram movie set to stream in Amazon Prime Video from June 2

యాక్షన్, డ్రామాగా రూపొందిన ఉగ్రం సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకొంటే అద్బుతంగా ఉంది. నాకు దక్కిన అవకాశాలు, గౌరవానికి రుణపడి ఉంటాను. ఉగ్రం సినిమా కోసం విజయ్ కనకమేడలతో కలిసి పనిచేశాను. యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఇది. ప్రతీ ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకొంటుంది అని అన్నారు.

ఉగ్రం చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్దమైంది. ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ద్వారా సుమారు 240 దేశాల్లో స్ట్రీమింగ్ చేయనున్నాం. జూన్ 2వ తేదీన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి మంచి అనుభూతిని పొందండి అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ప్రకటనలో తెలిపింది.

ఉగ్రం సినిమా విషయానికి వస్తే.. సుమారు 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్లుగా జరిగింది. ఈ సినిమాను దాదాపు 500 పైగా స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా భారీ లాభాలను ఆర్జించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X