Ugram OTT: భారీ ధరకు అల్లరి నరేష్ ఉగ్రం ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
ప్రముఖ దర్శకుడు, దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా పరిచయం అయ్యాడు అల్లరి నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈ కామేడీ హీరో హాస్య భరిత సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. కానీ అదంతా మొన్నటి మాట. ఈ మధ్య మాత్రం కంటెంట్ చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఉగ్రం సినిమాతో యాక్షన్ హీరో అని కూడా పిలిపించుకునేలా అదరగొట్టాడు. పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీ రైట్స్ ఆసక్తిగా మారింది.
కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో నాంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మునుపటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆద్యంతం అలరించిన ఈ హీరో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ సరికొత్తగా వైవిధ్యం చూపించాడు. తాజాగా మరోసారి ఉగ్రం అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

నాంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి అల్లరి నరేష్ నటించిన చిత్రమే ఉగ్రం. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలనే నెలకొన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇవాళ అంటే మే 5న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా నరేష్ యాక్టింగ్ అదిరిపోయిందని టాక్ వస్తోంది. అలాగే శ్రీచరణ్ పాకాల బీజీఎమ్ హైలెట్ గా నిలిచిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీగా పోటీ పడినట్లు తెలుస్తోంది. వాటిలో ప్రముఖ దిగ్గజం ఆ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందట. మంచి ఫ్యాన్సీ ధరతో ఉగ్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను సాధారణంగానే విడుదలైన నెల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారని టాక్. అంటే జూన్ ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











