OTT: నందమూరి బాలకృష్ణతో మరో బిగ్ ప్లాన్ వేసిన అల్లు అరవింద్.. నెవ్వర్ బిఫోర్ ప్రాజెక్ట్!

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేశాడు. బాలకృష్ణ అన్ ష్టాపబుల్ షో సీరీస్ 1 అండ్ 2 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా నిర్వహించిన ఈ బిగ్గెస్ట్ షో ... సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. ఇప్పుడు అల్లు అరవింద్ బాలకృష్ణతో మరో బిగ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎకంగా ఒక వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అల్లరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అన్ స్టాపబుల్ రెమ్యునరేషన్

అన్ స్టాపబుల్ రెమ్యునరేషన్

అల్లు అరవింద్ ఆహా వీడియో ఫ్లాట్ ఫామ్ కోసం నందమూరి బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండవ సీజన్ కూడా ప్లాన్ చేయగా ఆ సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ నేపద్యంలోనే అన్ స్టాపబుల్ విత్ షో కి రెమ్యూనరేషన్ గట్టిగా రాగా అదంతా బసవతారకం హాస్పిటల్ లో వైద్యానికి ఖర్చు చేసుకోలేని రోగులకు బాలకృష్ణ ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

మొదట అల్లుతో సినిమా

మొదట అల్లుతో సినిమా

ఇక త్వరలోనే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె మూడవ సీజన్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సంగతి పక్కన పెడితే బాలకృష్ణతో అల్లు అరవింద్ ఒక సినిమా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అల్లు అరవింద్ కెరియర్ లో మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సినిమాలు చేస్తే సక్సెస్ సాధించారు. కానీ ఇప్పుడు బాలకృష్ణతో సాన్నిహిత్యం పెరిగిన నేపథ్యంలో ఆయనతో కూడా ఒక సినిమా చేయాలని భావించారు.

బాలకృష్ణతో వెబ్ సీరీస్

బాలకృష్ణతో వెబ్ సీరీస్

అయితే సినిమా ఇప్పట్లో కుదిరేలా లేదని భావిస్తున్న అల్లు అరవింద్ ఇప్పుడు బాలకృష్ణతో కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి కూడా అనేక మంది స్టార్ యాక్టర్స్ వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చి ఓటిటి ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నారు. ఈ నేపద్యంలోనే ఒక పూర్తిస్థాయి తెలుగు వెబ్ సిరీస్ నిర్మించాలని అందులో బాలకృష్ణనీ నటింప చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ప్రాజెక్ట్

అనిల్ రావిపూడి ప్రాజెక్ట్

ప్రస్తుతానికి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నాడు. వీర సింహారెడ్డి సక్సెస్ తర్వాత ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకునే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా నటిస్తుందని సమాచారం. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం లేదు.

ఆ దర్శకుడితో కూడా..

ఆ దర్శకుడితో కూడా..

అలాగే బాలకృష్ణ గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బాలకృష్ణతో సినిమా చేయాలని ముందే అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఇంకా సరైన స్టోరీ సిద్ధం కాలేదు. ముందుగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ వారితో బాలయ్య వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో బాలయ్య ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X