Unstoppable with NBK 2: చంద్రబాబు రావడం వెనుక అల్లు వ్యూహం.. దెబ్బకు రేంజ్ పెరిగిపోయింది!
నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ రెండవ సీజన్ మొత్తానికి మరో రికార్డును క్రియేట్ చేసేలా క్రేజ్ అందుకుంది. అసలు సెకండ్ సీజన్లో మొదటి గెస్ట్ ఎవరూ అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఇక మొత్తానికి బాలయ్య బాబు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని షోలోకి తీసుకువచ్చి సరికొత్త క్రేజ్ అయితే అందించారు. అయితే దీని వెనుక నిర్మాత అల్లు అరవింద్ ఒక వ్యూహం కూడా రచించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆహా రేంజ్ మారిపోయింది
నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా చేస్తూ మొదలుపెట్టిన ఆహా అన్ స్టాపబుల్ షో నిజంగానే అన్ స్టాపబుల్ అనేలా ముందుకు సాగుతోంది. అసలు మొదట ఈ టాక్ షో టెలివిజన్ షోలో వస్తేనే సక్సెస్ అవుతుంది అని ఓటీతీలో జనాలు అంతగా పట్టించుకోకపోవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండుకు తగ్గట్టుగా ఆహా అన్ స్టాపబుల్ షో మంచి క్రేజ్ అందుకుంది. దానికి తోడు ఒక్కసారికి ఆహా కు ఆదరణ పెరిగింది.

చంద్రబాబుతో గ్రాండ్ గా
మొదటి సీజన్ తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెకండ్ సీజన్ ఇటీవల గ్రాండ్ గా మొదలైంది. నందమూరి బాలకృష్ణ మొదటి గెస్టుగా తన బావ అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం విశేషం. అలాగే బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ కూడా మధ్యలో స్పెషల్ గెస్ట్ వచ్చి సరికొత్త క్రేజ్ అందించాడు. ఇక ఈ షోలో చంద్రబాబు నాయుడు ఎన్నో కాంట్రవర్సీ విషయాలపై కూడా మాట్లాడడం విశేషం.

వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో..
నిజానికి ఈసారి మొదటి సీజన్ కోసం కొంతమంది సెలబ్రిటీలను ముందుగానే అనుకున్నారు. ఇక షో త్వరలోనే మొదలు కాబోతోంది అని డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కానీ షూట్ మొదలుపెట్టాలి అని అనుకున్న గత వారం ఒక సెలబ్రిటీలు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ హీరోను అలాగే దర్శకుడిని పిలవాలని అనుకున్నారట. కానీ వాళ్ళిద్దరూ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన రాలేకపోయినట్లుగా తెలుస్తోంది.

అల్లు అరవింద్ ఆలోచన
ఇక నిర్వాహకులు ఆహా అధినేత అల్లు అరవింద్ ను సంప్రదించగా మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు చర్చల్లోకి వచ్చాయని తెలుస్తోంది. అయితే ఎలాగూ చంద్రబాబు నాయుడు గారిని షోలోకి రప్పించాలని అనుకున్నాను కాబట్టి ముందుగా ఆయనతోనే మొదలుపెడితే బెటర్ అనే కామెంట్స్ వచ్చాయి. అయితే మొదట్లోనే చంద్రబాబు నాయుడుని తీసుకువస్తే ఈ షోకు కొంత నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంది అని నిర్వాకుల మధ్యలో అనుమానాలు కూడా వచ్చాయట.

ఆ విధంగా మొదటి ఎపిసోడ్
కానీ బాలయ్య బాబు అలాగే ప్రోగ్రాం దర్శకులు రైటర్ అందరూ కూర్చొని అల్లు అరవింద్ తో చర్చలు జరపగా పక్కా ప్లాన్ సెట్ చేశారట. ఒకవేళ చంద్రబాబుతో ఎపిసోడ్ కరెక్ట్ గా రాకపోతే కొంత ఆలస్యం చేసి సీజన్ కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా స్టిమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ అల్లు అరవింద్ ఆలోచన విధానంతో ఈ ఎపిసోడ్ కు బలం చేకూరింది. దీంతో మొదటి ఎపిసోడ్ గా చంద్రబాబునాయుడిని బాలయ్య మొదలుపెట్టారు. ఈ విధంగా ఎవరితోనో మొదలు కావాల్సిన అన్ స్టాపబుల్ షో సరికొత్త కాంట్రవర్సీ టాపిక్ తో చంద్రబాబుతోనే మొదలుపెట్టించారు. మరి తదుపరి ఎపిసోడ్లో ఎవరు గెస్ట్ గా వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











