Telugu Indian Idol 2 Finale రెండేళ్ల చిన్నారికి తల్లిగా అంటూ.. అల్లు అర్జున్ ఎమోషనల్.. విజేతలకు ఎన్ని లక్షలంటే
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఘనంగా ముగిసింది. గత కొద్ది నెలలుగా రసవత్తరంగా సాగిన ఈ రియాల్టీ షో ఫైనల్ ఆసక్తికరంగా సాగింది. సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారిని కూడా ఆకట్టుకొన్నది. యువ ప్రతిభావంతుల మధ్య పోటాపోటీగా జరిగిన ఫైనల్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ఏం జరిగింది? అల్లు అర్జున్ స్పీచ్ ఎలా సాగిందనే విషయంలోకి వెళితే..
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 రియాలిటీ షో కోసం 10 వేల మందికిపైగా ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. దాదాపు 12 మంది యువ గాయకులు ఈ పోటీకి అర్హత సాధించారు. చివరగా 5 గురు ఫైనల్ పోటీకి చేరారు. న్యూ జెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన జయరాం, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, హైదరాబాద్ నుంచి కార్తీక్, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల ఫైనల్‌లో పాల్గొన్నారు.

ఉత్కంఠగా సాగిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలేలో విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచారు. ఆమెకు పారితోషికం కింద ట్రోఫితోపాటు 5 లక్షల రూపాయల బహుమానాన్ని అందుకొన్నారు. ఫస్ట్ రన్నర్ జయరాం ట్రోఫితోపాటు 3 లక్షలు, సెకండ్ రన్నర్ లాస్య ప్రియకు 2 లక్షల రూపాయల బహుమానం లభించింది.

యువ గాయని సౌజన్య భాగవతులను విజేతగా ప్రకటించిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆహా ఓటీటీ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేలో పాల్గొనటం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. సంగీతంలో ఎంతో ప్రతిభావంతులైన వీరి ప్రదర్శన చూసి మనసంతా ఆనందంతో నిండిపోయింది. సంగీతంపై మరింత ప్రేమ పెరిగింది. ఈ షో నాకెంతో ప్రత్యేకమైనది, మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిందనాలి. సౌజన్యకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

సౌజన్య అసాధారణమైన విజయాన్ని సాధించింది. రెండేళ్ల చిన్నారికి తల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొనటం.. ఓ వైపు సంగీతం, మరో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది అంత సులువైన విషయం కాదు. ఆమె అంకిత భావం, నిబద్ధత చూస్తే గౌరవం పెరిగింది. ఆమెకు కుటుంబం నుంచి వచ్చిన మద్దతును ప్రశసించాల్సిందే అని అల్లు అర్జున్ అన్నారు.


Click it and Unblock the Notifications











