Unstoppable 4: బాలయ్య షోలో పుష్పరాజ్ సందడి.. బన్నీ- సుక్కుల ప్లాన్ మామూలుగా లేదుగా..
Unstoppable 4 - Allu Arjun: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK). ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకూ విజయవంతంగా
మూడు సీజన్లు పూర్తి చేసుకుని.. నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ మూడు ఎపిసోడ్ లు కంప్లీట్ అయ్యాయి. తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4 నాల్గవ ఎపిసోడ్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable with NBK). టాక్ షోలో తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ.. అన్ బ్రేకెబుల్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఇప్పటివరకూ మూడు సీజన్లను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌ను ప్రారంభించింది. బాలయ్య తన షో తో ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీ సంఖ్యలో పెరిగాయంటే.. అతిశయోక్తి కాదు.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4వ సీజన్ లో తొలి గెస్టుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు(Chandra babu Naidu)రాగా.. రెండో ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు లక్కీ భాస్కర్ టీం సందడి చేసింది. ఇక మూడవ ఎపిసోడ్ లో హీరో సూర్యతో పాటు కంగువ టీం సందడి చేసింది. ఇలా ఇంట్రెస్టింగ్ , ఫ్యాన్స్ కు హర్ట్ కు టచ్ అయ్యే కంటెంట్ తో రావడంతో ఈ షోకు భారీ వ్యూయర్‌షిప్ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ టాక్ షో నాలుగ ఎపిసోడ్ కు గెస్టులుగా ఎవరు రానున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4వ సీజన్ నాల్గవ ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా మరోసారి అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారట. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను ఆహా రిలీజ్ చేసింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయనున్నారు. గతంలో పుష్ప 1 మూవీ ప్రమోషన్స్ భాగంగా అన్‌స్టాపబుల్ షో పాల్గొని బాలయ్య తో అల్లు అర్జున్ సందడి చేశాడు. తాజాగా పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షో పాల్గొన్నబోతున్నారు. బాలయ్య షో నుంచే పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ప్రారంభించాలని మూవీ టీం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో అల్లు అర్జున్ తో పాటు ఎవరు పాల్గొనబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇదెలా ఉండే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ మూవీ డిసెంబర్ 5 న పంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, గ్లిమ్స్ వంటి అప్డేట్ కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.విడుదలకు ముందే రూ. 1,000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి పలు రికార్డులను క్రియేట్ చేసింది పుష్ప 2. ఈ మూవీలో రష్మిక మందన్నా, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











