Pushpa 2 OTT: రికార్డు స్థాయిలో పుష్ప 2 ఓటీటీ రైట్స్‌.. ఇలా తొలిసారి.. RRR ఎఫెక్ట్.. ఆ సంస్థకు సొంతం?

పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ ను చేసింది ఈ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ వరకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా పుష్ప 2 వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ టాపిక్ ఆసక్తికరంగా మారింది.

వరల్డ్ వైడ్ గా అలా..

వరల్డ్ వైడ్ గా అలా..

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రూ. వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరి.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం.

రంగంలోకి సీనియర్ హీరో..

రంగంలోకి సీనియర్ హీరో..

పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అందుకే క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పుష్పరాజ్ ను స్ట్రాంగ్ గా ఢీకొట్టబోయేందుకు తన సెంటిమెంట్ నటుడు అయిన జగపతి బాబును రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా జగపతి బాబుకు సంబంధించిన షూటింగ్ ను వైజాగ్ లో చిత్రీకరించారు.

పొలిటీషియన్ గా

పొలిటీషియన్ గా

'పుష్ప: ది రూల్' సినిమాలో ఫహాద్ పాజిల్ మాత్రమే కాకుండా ప్రధాన విలన్ గా జగపతి బాబు ఉండనున్నాడని టాలీవుడ్ టాక్ నడిచింది. అంతేకాకుండా అందులో భన్వర్ సింగ్ షెకావత్ గా అదరగొట్టిన ఫహాద్ పాజిల్ ఈ సీక్వెల్ లోనూ కొనసాగనున్నాడు. అతనికి అండదండగా నిలిచే పవర్ ఫుల్ పొలిటీషియన్ గా జగపతి బాబు క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత హిట్టో తెలిసిందే.

హైదరాబాద్, వైజాగ్ లలో..

హైదరాబాద్, వైజాగ్ లలో..

పుష్ప 2 సినిమాలో కూడా అలాంటి ఐటమ్ నెంబర్ ను ప్లాన్ చేస్తున్నాడట లెక్కల మాస్టర్ సుకుమార్. అయితే ఈ సారి ఇందులో యాంకర్ అనసూయతో స్పెషల్ సాంగ్ రెడీ చేస్తున్నాడనే వార్తలు గట్టిగా వినిపించాయి. ఇక వీటిలో నిజం ఎంతుందో తెలియదు గానీ పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పుష్ప 2 మూవీ షూట్ అక్టోబర్ 30, 2022న ప్రారంభించారు. కొన్ని రోజులు హైదరాబాద్, వైజాగ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

పుష్ప కంటే మరింతగా..

పుష్ప కంటే మరింతగా..

ఫిబ్రవరిలో హీరోయిన్ రష్మిక మందన్నాతో షూటింగ్ జరిపారట. పుష్ప కంటే పుష్ప 2 మరింత బాగుంటుందని, మైండ్ బ్లోయింగ్ అని, సమ్ థింగ్ ప్యాబులస్ అని నేషనల్ క్రష్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పుష్ప 2కు ఓటీటీ రైట్స్ కోసం భారీగా పోటీ జరుగుతోందని టాక్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 200 కోట్లు కోట్ చేస్తున్నారట.

RRR మూవీ ద్వారా..

RRR మూవీ ద్వారా..

భారీ మొత్తం అయినా రూ. 200 కోట్లు ఇచ్చయినా సరే పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోవాలని ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netfilx) ప్రయత్నిస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే RRR మూవీ ద్వారా నెట్ ఫ్లిక్స్ కు మంచి వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ వచ్చాయట. RRR తర్వాత అంతటి రేంజ్ తెచ్చుకున్న సినిమా పుష్ప. అందుకే నెట్ ఫ్లిక్స్ దృష్టి ఇప్పుడు పుష్ప 2 మీద పడిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇలా షూటింగ్ లో ఉన్నప్పుడే ఏకంగా రూ. 200 కోట్లకు డిజిటల్ రైట్స్ కోట్ చేయడం రికార్డుగా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X