twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa 2 OTT: రైట్స్ కోసం ఎగబడుతున్న బడా సంస్థ.. అంతకుమించి అనేలా డీల్?

    |

    స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న పుష్ప 2 సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అయితే అప్పుడే సినిమా ఓటీటీ హక్కులు కోసం కొన్ని బడా కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ అలాగే మరో సంస్థ పుష్ప సెకండ్ పార్ట్ ఓటీటీ హక్కుల కోసం భారీ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఎవరు దక్కించుకోబోతున్నారు.. అనే వివరాల్లోకి వెళితే..

    బిగ్గెస్ట్ హిట్

    బిగ్గెస్ట్ హిట్

    క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మూడవసారి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా పుష్ప 1 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మొదట కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా పుష్ప 1 సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో మొదటిసారి అల్లు అర్జున్ 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

     స్క్రిప్ట్ లో మార్పులు

    స్క్రిప్ట్ లో మార్పులు

    అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ వలన ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత అంచనాలు పెరిగాయి. నిర్మాతలు దర్శకుడు కూడా సినిమాను భారీ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా సుకుమార్ అయితే సెకండ్ పార్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

     మొదట కేవలం ఒక బాగంలోనే..

    మొదట కేవలం ఒక బాగంలోనే..

    అసలైతే పుష్ప సినిమాను కేవలం ఒక భాగంలోనే తెరపైకి తీసుకోవాలని రావాలని అనుకున్నారు. కానీ కథ చాలా బలంగా ఉండడంతో ఎడిటింగ్ లోనే చాలా ఎక్కువ భాగం వేస్ట్ అవుతుంది అని సెకండ్ పార్ట్ కా కూడా కొనసాగించాలి అనే డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేసి మళ్లీ కొత్తగా మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

     నెట్ ఫ్లిక్స్ ఆఫర్స్

    నెట్ ఫ్లిక్స్ ఆఫర్స్

    సినిమాకు సంబంధించిన షూటింగ్ పై ఇంకా ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. అప్పుడే సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన డీల్స్ పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ అయితే చాలా ఎక్కువ స్థాయిలో ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే RRR సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా ఎక్కువ స్థాయిలో ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    బిజినెస్ లెక్కలు మారాయి..

    బిజినెస్ లెక్కలు మారాయి..

    పార్ట్ వన్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి బిజినెస్ లెక్కలు మారిపోయాయి. అందుకే కేవలం హిందీ హక్కులు దొరికినా కూడా నెట్ ఫ్లిక్స్ అయితే వదులుకోవాలని అనుకోవడం లేదు. RRR తరహా లోనే పుష్పను కూడా వరల్డ్ వైడ్ గా ఉపయోగించుకోవాలి అని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆలోచిస్తోంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఇక మరోసారి చర్చల అనంతరం ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

    English summary
    Allu arjun Pushpa 2 movie ott deal discussion latest updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X