Pushpa 2 OTT: కళ్లు చెదిరే ధరకు పుష్ప 2 ఓటీటీ రైట్స్! అల్లుఅర్జున్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Pushpa 2 OTT platform: అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా కోట్లాదిమంది అభిమానులు వేచి చూస్తున్నారు. విడుదలకు ముందే భారీ అంచనాలను పుష్ప 2 పై నెలకొన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సందర్భంలో ఈ మూవీ ఓటీటీ అప్డేట్ గురించి, డిజిటల్ రైట్స్ గురించి మూవీ లవర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ ఓటిటి రైట్స్ ఏ ప్లాట్ ఫామ్ దక్కించుకుంది? పుష్ప 2 ఓటీటీ రైట్స్ కోసం ఎన్ని వేల కోట్లు వెచ్చించింది. ఇంతకీ పుష్ఫ 2 సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? అనేది చర్చనీయంగా మారింది.
సినిమా లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఫహద్ పోజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.అలానే క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ కూడా చేసింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించారు.

పుష్ప 2 మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్ తన భుజాన వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు పట్టణాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. నేడు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. నార్త్.. సౌత్.. అనే తేడా లేకుండా ప్రమోషన్ ఈవెంట్ లో దుమ్మురేపుతున్నారు బన్నీఫ్యాన్స్ . ఎక్కడ ప్రమోషన్ ఈవెంట్ పెట్టిన లెక్కలేనంతగా అల్లు అర్జున్ ఫ్యాన్ ఈవెంట్ కు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, ఐటెం సాంగ్ మూవీపై అంచనాల్ని పెంచేశాయి.
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 న ఆరు భాషల్లో దాదాపు 12,000 స్క్రీన్స్ లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లో పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా పుష్ప 2 మూవీ టికెట్ రేట్లతో సంబంధం లేకుండా హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలలో పుష్ప 2 మూవీ టికెట్లు దాదాపు 1500 వరకు పలుకుతుందంటే అతిశక్తి కాదు .ఇక తెలుగు రాష్ట్రాలలో పుష్ప టికెట్ రేట్ రూ . 1000 వరకు పలుకుతుండట.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఓటిటి విషయానికి వస్తే .. పుష్ప 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం.. ఓటీటీ ప్లాట్ఫామ్స్ గట్టిగానే పోటీపడ్డాయట. ఈ పోటీలో అమెజాన్ చివరి వరకు పోటీపడిన నెట్ ఫ్లిక్స్ ఓటిటి రైట్స్ ను దక్కించుకుందట. ఇండస్ట్రీ ఇన్పుట్స్ ప్రకారం పుష్ప 2 ఓటిటీ రైట్స్ ను రూ. 275 కోట్లకు నెట్ ఫిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో పుష్ప 1 మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ కేవలం 30 కోట్లకు దక్కించుకుంది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఓటిటీ రైట్స్ ను రికార్డ్ స్థాయిలో 175 కోట్లకు కొనుగోలు చేసింది ప్రస్తుతం పుష్ప 2 ఓటిటీరికార్డ్స్ గత రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పాలి.
పుష్ప 2 ఓటీటీలోకి ఎప్పుడు.. అల్లు అర్జున్ పుష్ప టు మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఏ మూవీ అయినా రిలీజ్ అయిన నాలుగు నుండి ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కొన్ని సినిమాలయితే.. కేవలం 10 నుండి 15 రోజులలో విడుదల అవుతాయి. కానీ పుష్పటు భారీ బడ్జెట్ మూవీ. ఒకవేళ హిట్ టాక్ అందుకుంటే.. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పాడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుందని, అటు మూవీ మేకర్స్ ఇటు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











