శ్రీలీలతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్
విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్న ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. ఒరిజినల్ కంటెంట్, ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలు, టాక్ షోస్, డ్యాన్స్ షోస్, రియాలిటీ షోతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆహా కిడ్స్, గేమింగ్ ఈవెంట్స్‌తో దూసుకెళ్తున్నది. ఇలాంటి ప్రముఖ యాప్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ క్యాంపెయిన్‌లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీలీల కూడా భాగసామ్యం అయ్యారు. ఈ క్యాంపెయినింగ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ క్యాంపెయినింగ్ వివరాల్లోకి వెళితే..
ప్రేక్షకులకు ఆహాను మరింత చేరువ చేయడానికి అల్లు అర్జున్, శ్రీలీలతో కలిపి యాడ్ క్యాంపెయిన్ షూట్ చేశారు. ఈ యాడ్‌లో చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. శ్రీలీల మెడపై చమ్మక్ చంద్ర కత్తి పెడితే.. ఐకాన్ స్టార్ తనదైన శైలిలో ఎంట్రీ ఇస్తారు. నీవు ఆహా చూడు.. నేను ఆహా చూపిస్తా అంటూ చమ్మక్ చంద్ర వైపు ఫోన్ విసిరుతాడు.

ఆహా యాప్‌లో అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్సులు, సెంటిమెంట్ సీన్లను చూస్తూ చమ్మక చంద్ర కొత్త అనుభూతికి గురవుతాడు. అల్లు అర్జున్, శ్రీలీల సామజవరగమన, సినిమా చూపిస్త మామ లాంటి పాటలకు రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. విభిన్నమైన కార్యక్రమాలకు ఆహా యాప్ చూడండి అంటూ క్యాంపెయినింగ్ వీడియోలో కనిపించారు.
ఆహా యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆహాతో మరోసారి కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది. 3 ఏళ్ల ప్రయాణంలో వైవిధ్యమైన కంటెంట్‌తో ఆహా ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది.సరికొత్త అనుభూతిని ఆశించే ప్రేక్షకులకు గమ్యస్థానంగా మారింది. నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో బలమైన స్థానాన్ని సొంతం చేసుకోవాలని కోరుకొంటాను. ఆహాతో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను అని అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆహా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా కంటెంట్ ఉంది. మేము ప్రారంభించిన క్యాంపెయినింగ్ ప్రేక్షకుల జీవితాల్లో మరింత ఆనందాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ప్రతీ కంటెంట్‌ను ఆవిష్కరించేలా యాడ్ డిజైన్ చేశాం. ఆహాలో ఏమేమీ ఉన్నాయో.. వాటిని ఆవిష్కరించేలా క్యాంపెయినింగ్ రూపొందించాం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

.
టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ మై హోం గ్రూమ్ సంయుక్తంగా 2020లో ఆహాను ప్రారంభించారు. అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోం గ్రూప్, అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్) వారి జాయింట్ వెంచర్ ఆహా నడుస్తున్నది. 100% లోకల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తామనే మాటను నిలబెట్టుకున్న ఆహా తమిళంలో 100 % లోకల్ ఎంటర్‌టైన్మెంట్‌ను సిరీస్‌లు, సినిమాల రూపంలో అందించటాన్ని ఈ మధ్యనే ప్రారంభించింది. 2000 గంటలకు పైగా అసాధారణమైన కంటెంట్, 350కు పైగా ప్రత్యేకమై ప్రోగ్రామింగ్‌తో ప్రేక్షకులకు ఆహా నాణ్యమైన వినోదాన్ని అందిస్తూ క్వాలిటీ ఎంటర్‌టైన్మెంట్ అనే పదానికి పర్యాయ పదంగా మారింది.


Click it and Unblock the Notifications











