Pushpa 2 OTT : పాకిస్తాన్‌లో పుష్పగాడి రూలింగ్ .. ఒక్కో ఏరియా అల్లు అర్జున్ కంట్రోల్‌లోకి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ఏ రేంజ్‌లో ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 3లో చోటు దక్కించుకుంది. విడుదలైన నాటి నుంచి ఒక్కో సినిమా రికార్డుల్ని తుక్కురేగ్గొడుతూ అల్లు అర్జున్ హవా చూపించాడు. తాజాగా ఓటీటీలోనూ థియేటర్‌కి మించి కుమ్మేస్తున్నాడు.
దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2ని నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి మరో హీరోకు సాధ్యం కానీ రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్. గతేడాది డిసెంబర్ 5న మొదలైంది అసలు సిసలు తుఫాన్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజైన పుష్ప 2 తొలి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ సాధించి అలవోకగా 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఇటీవలే అర్ధ శత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం .. ఇప్పటి వరకు రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది . డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.250 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది. పుష్ప 2ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూశారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. జనవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ థియేటర్‌లో మంచి ఆక్యూపెన్సీ, రీ లోడెడ్ వెర్షన్‌కు కూడా ప్రేక్షకుల ఆదరణ బాగుండటం, తదితర కారణాల వల్ల పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది.

ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. జనవరి 30 నుంచి 20 నిమిషాల ఎక్స్‌టెండెడ్ వర్షన్‌తో కలిపి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. కేవలం 24 గంటల వ్యవధిలోనే పుష్ప 2 ది రూల్.. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాల బయోలలో దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ రాసుకొచ్చింది.
తాజాగా పుష్ప 2 ఓటీటీలలో మరో రేర్ ఫీట్‌ను అందుకుంది. భారత్‌లో నెంబర్ వన్‌గా ఉన్న ఈ సినిమా ఏకంగా 21 దేశాల్లో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ కూడా ఉండటం విశేషం. మొత్తంగా నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్ 10 లిస్ట్‌లో పుష్ప 2 ఏడో స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో చెప్పినట్లు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అన్న మాట అక్షరాల నిజమైంది. నాలుగు రోజులకే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పుష్పగాడు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











