పాపులర్ హిందీ షోలో అల్లు అర్జున్, యష్, రిషబ్ శెట్టి.. భార్యలతో సహా.. అలాంటి ప్రశ్నలతో స్టార్ ప్రొడ్యూసర్

ఇటీవల కాలంలో సౌత్ హీరోల స్థాయి పెరిగిపోతుంది. అందుకు కారణం వారి నటన, తెరకెక్కించే సినిమాలు. తాజాగా దసరా సినిమాతో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఇరగదీసాడు. అతనికంటే ముందుగా RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్, పుష్పతో అల్లు అర్జున్, కేజీఎఫ్ సినిమాతో యష్, కాంతారా చిత్రంతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా మన్ననలు పొందారు. దీంతో బాలీవుడ్ సౌత్ సినీ ఇండస్ట్రీవైపు చూస్తోంది. అందుకే తమ చిత్ర పరిశ్రమలోని పాపులర్ టాక్ షోకి అతిథులుగా దక్షిణాది హీరోలను ఆహ్వానించినట్లుగా టాక్ వస్తోంది.

ఓటీటీ షోల ద్వారా..

ఓటీటీ షోల ద్వారా..

కరణ్​ జోహార్​.. ప్రస్తుతం ఇతని గురించి తెలియని వారు ఎవరుండరు. ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వాటిని ఆయనే సొంతగా నిర్మించారు. గతేడాది ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ టాక్ అందుకున్న లైగర్ నిర్మాతల్లో ఆయన ఒకరు. తర్వాత బ్రహ్మాస్త్ర కూడా నిర్మించారు. ఇక ఆయన ఓటీటీలో వచ్చే షోల ద్వారా పాపులర్ అని తెలిసిన విషయమే.

నిర్మోహమాటంగా..

నిర్మోహమాటంగా..

దర్శక నిర్మాతగా, హోస్ట్​గా సక్సెస్​ఫుల్​ అయ్యాడు కరణ్​ జోహార్. ఇక ఇతను వ్యాఖ్యతగా వ్యవహరించే కాఫీ విత్ కరణ్​ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఈ షోలో సెలబ్రిటీలను పిలిచి వారిపై ప్రశ్నలు కురిపిస్తాడు. తిరకాసు క్వశ్చన్స్ వేసి వివిధ రకాలుగా రోస్ట్​ చేస్తాడు. అది ఎలాంటి ప్రశ్న అయిన నిర్మొహమాటంగా అడిగేస్తాడు. తను కూడా అలాంటి సమాధానాలే చెబుతాడు.

 బాలీవుడ్ సెలబ్రిటీలు..

బాలీవుడ్ సెలబ్రిటీలు..

కరణ్ జోహార్ హోస్ట్ గా చేసే కాఫీ విత్ కరణ్ టాక్ షో ఇప్పటికీ 7 సీజన్లు పూర్తి చేసుకుంది. వీటిలో ఎంతోమంది స్టార్ బాలీవుడ్ దిగ్గజాలు పాల్గొని వారి జీవితాల్లోని బోల్డ్, రొమాంటిక్, హాట్ సీక్రెట్స్ బయటకు చెప్పారు. అంటే కరణ్ జోహార్ బయటపెట్టించారు. ఇక ఏడో సీజన్ లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, టైగర్ ష్రాఫ్, కృతీ సనన్ ఇలా ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు అతిథులుగా హాజరయ్యారు.

7వ సీజన్ లో మాత్రం..

7వ సీజన్ లో మాత్రం..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా ప్రసారమయిన కాఫీ విత్ కరణ్ టాక్ షో 7వ సీజన్ లో సౌత్ నుంచి విజయ్ దేవరకొండ, సమంత కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు త్వరలో 8వ సీజన్ ను స్టార్ట్ చేయనున్నారట. అయితే ఈ సీజన్ ను బాలీవుడ్ బాద్ షో షారుక్ ఖాన్ తో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయన ప్రతీ సీజన్ లో సందడి చేశారు. కానీ 7వ సీజన్ లో మాత్రం పాల్గొనలేదు. అందుకే షారుక్ తో స్టార్టింగ్ ఎపిసోడ్ ప్రారంభిస్తరాని టాక్.

నార్త్ లో కూడా..

నార్త్ లో కూడా..

కరణ్ జోహార్ టాక్ షో 8వ సీజన్ లో ప్రారంభ ఎపిసోడ్ లో షారుక్ ఖాన్ పఠాన్ ఘన విజయంపై చర్చిస్తారని బాలీవుడ్ వర్గాల టాక్. ఇక తర్వాతి ఎపిసోడ్స్ లలో సౌత్ నుంచి బిగ్గెస్ట్ హిట్లు కొట్టిన హీరోలు పార్టిస్ పేట్ చేయినున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ (పుష్ప), యష్ (కేజీఎఫ్ సిరీస్), రిషబ్ శెట్టి (కాంతారా) తమ సినిమాలతో నార్త్ లో కూడా సత్తా చాటారు. అందుకే ఈ ముగ్గురు కాఫీ విత్ కరణ్ టాక్ షో 8వ సీజన్ లో అతిథిలుగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

భార్యలతో సహా ఆహ్వానం..

భార్యలతో సహా ఆహ్వానం..

అంతేకాకుండా ఈ హీరోలతోపాటు వారి భార్యలను కూడా కరణ్ టాక్ షో 8వ సీజన్ కు ఆహ్వానిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ షోలో పాల్గొనే అతిథుల జాబితాను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక వీళ్లందరిని తన హోస్టింగ్ తో, బోల్డ్, హాట్ ప్రశ్నలతో రోస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. ఇదిలా ఉంటే కరణ్ సుమారు ఏడేళ్ల తర్వాత రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీతో దర్శకుడిగా కమ్ బ్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X