Pushpa 2 OTT Release: పుష్ప 2 ఓటీటీ రిలీజ్ అప్పుడే? అధికారికంగా ప్రకటించిన మైత్రీ మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ ఎర్నేని నిర్మాణ సారథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధిస్తున్నది. సుమారు 50 రోజులుగా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి మైత్రీ నిర్మాతలు అధికారికంగా సమాచారాన్ని వెల్లడించారు. పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్ గురించిన వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తుండగానే.. అభిమానులకు మరింతగా అదనంగా అనుభూతిని పంచడానికి 20 నిమిషాల నిడివిని పెంచి కొత్త వెర్షన్ థియేటర్‌లోకి తీసుకొచ్చారు. దాంతో మరోసారి రిపీట్ ఆడియెన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి. దాంతో మరికొన్నాళ్లు ఈ సినిమాను థియేటర్లలోనే ప్రదర్శించాలని నిర్మాతలు నిర్ణయించారు.

అయితే పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై మీడియాలో వస్తున్న వార్తలను మైత్రీ మూవీ మేకర్స్ ఖండించింది. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. ఓటీటీ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారమే రిలీజ్ అవుతుంది. అంతకంటే ముందే ఈ సినిమా రిలీజ్ కాదు అని మైత్రీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
మైత్రీ మూవీ మేకర్స్ అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ పోస్టు పెట్టింది. పుష్ప 2: ది రూల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అనేక రూమర్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. ఈ సినిమాను థియేటర్లో బిగ్ స్క్రీన్లలోనే చూసి ఎంజాయ్ చేయండి. హాలీడేస్ సందర్భంగా కొత్త అనుభూతిని పొందండి. పుష్ప 2 మూవీ విడుదల తర్వాత 56 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. అప్పటి వరకు పుష్ప వైల్డ్ ఫైర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.
పుష్ప 2 సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు అత్యధికంగా డిమాండ్ ఉండటంతో ఫ్యాన్సీ రేటుకు ఈ హక్కులను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాను ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా, పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 1831 కోట్ల రూపాయలు వసూలు చేసిందని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ సినిమా కలెక్షన్లను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











