ఓటీటీలోకి అల్లు శిరీష్ బడ్డీ.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పటి నుంచి అంటే..?
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు సరైన హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు అల్లు శిరీష్. మెగా, అల్లు ఫ్యామిలీల బ్రాండ్ ఇమేజ్ కేవలం లాంచింగ్ వరకే ఉపయోగపడింది. మనోడు ఎంతగానో కష్టపడుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. దీంతో కొడుకు భవిష్యత్‌పై అల్లు అరవింద్, తమ్ముడి కెరీర్ ట్రాక్‌లో పెట్టాలని అల్లు అర్జున్ తెగ మదనపడిపోతున్నారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.
దీనిలో భాగంగా కొంతమంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయించడంతో పాటు శిరీష్‌కు సూటయ్యే కథలను సెట్ చేసే పనులు మొదలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటించగా.. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన బడ్డీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టికెట్ల ధరలు తగ్గించాలంటూ అల్లు శిరీష్ చేసిన విజ్ఞప్తి ఇండస్ట్రీ పెద్దలను, ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నిర్మాతతో చర్చించి తమ సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గించామని ఆయన చెప్పారు. టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుల నుంచి డబ్బు సంపాదించేకన్నా.. ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించి, మరింత సంపాదించొచ్చన్నది తన సూత్రమని శిరీష్ వెల్లడించారు.
భారతదేశంలో హిందీ మాట్లాడేవాళ్లు 90 కోట్ల మంది ఉన్నప్పటికీ .. థియటర్‌కు వచ్చి సినిమాలు చూసేవారి సంఖ్య నాలుగు కోట్లు మాత్రమే ఉంటుందని , అదే తెలుగు మాట్లాడేవాళ్లు 10 కోట్ల మంది ఉంటే.. థియేటర్లకు వచ్చే వారి సంఖ్య 3 కోట్ల పై మాటేనని తెలిపారు. దీనిని బట్టి తెలుగువారు సినిమాను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్ధం చేసుకోవాలని.. బంగారు బాతుని చంపేసి తినకుండా ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే టికెట్ రేట్లను తగ్గించాలని శిరీష్ సూచించాడు. మా ప్రయత్నం సక్సెస్ అయితే మరింత మంది ఇదే బాటలో నడుస్తారని ఆయన ఆకాంక్షించారు.
ప్రియురాలి ఆత్మ ఓ టెడ్డీబేర్‌లో ప్రవేశించడం, ప్రాణం ఉండగానే ఆమె ఆత్మ శరీరాన్ని ఎలా విడిచింది అన్నదే ఈ బడ్డీ స్టోరీ. ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, పోస్టర్లు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు మంచి బజ్ తీసుకొచ్చాయి. అల్లు శిరీష్ ఈ సినిమాలో అద్భుతంగా నటించినట్లు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న బడ్డీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
బడ్డీ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అగ్రిమెంట్ ప్రకారం ఓటీటీలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 30 నుంచి బడ్డీ సినిమా తమ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అదే రోజున స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











