Buddy OTT: అల్లు శిరీష్ బడ్డీ ఓటీటీ వివరాలు లీక్.. ఎప్పుడు, ఎందులో వస్తుందంటే!

తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని ఫ్యామిలీలకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందులో అల్లు కుటుంబం ఒకటి. దీనిద్వారా ఎంతో మంది సినీ రంగంలో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన పిల్లలను సినీ రంగానికి పరిచయం చేశారు. అందులో అల్లు శిరీష్ ఒకడు. అతడు తాజాగా నటించిన సినిమానే 'బడ్డీ' (Buddy).

చాలా కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తున్న టాలెంటెడ్ గాయ్ అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా సినిమానే 'బడ్డీ'. ఈ చిత్రాన్ని సామ్ ఆంటన్ తెరకెక్కించాడు. మెడికో థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రంపై ఆరంభంలోనే కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఆగస్టు 2వ తేదీన విడుదల చేశారు.

Allu Sirish Starrer Buddy Movie Digital Streaming Details Revealed

మెడికో థ్రిల్లర్ అండ్ ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన 'బడ్డీ' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ లభించలేదు. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆశించిన రీతిలో కాకుండా తక్కువగానే వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు కూడా ఎవరూ ఊహించని విధంగా డల్‌గా వస్తున్నాయి.

అల్లు శిరీష్ హీరోగా నటించిన 'బడ్డీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చేశాయి. లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఇక, తాజాగా స్ట్రీమింగ్ డేట్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Allu Sirish Starrer Buddy Movie Digital Streaming Details Revealed

అల్లు శిరీష్ - సామ్ ఆంటన్ కాంబినేషన్‌లో రూపొందిన 'బడ్డీ' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అంటే ఆగస్టు 2వ తేదీన విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'బడ్డీ' మూవీని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇందులో గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ఆలీ నటించారు. హిప్ హప్ తమీజా మ్యూజిక్ ఇచ్చాడు.

More from Filmibeat

Read more about: buddy allu sirish buddy ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X