నెల కాకుండానే ఓటీటీలోకి క్రేజీ మూవీ.. మెగా హీరో ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

తెలుగు చిత్ర పరిశ్రమలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు కష్టపడుతున్నాడు బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు శిరీష్. చాలా కాలంగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న అతడు.. పెద్దగా విజయాలను మాత్రం అందుకోవడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని చేసిన చిత్రమే 'బడ్డీ'.

సుదీర్ఘ కాలంగా భారీ విజయంపై కన్నేసిన టాలెంటెడ్ గాయ్ అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా సినిమానే 'బడ్డీ' (Buddy). సామ్ ఆంటన్ తెరకెక్కించిన ఈ సినిమా మెడికో థ్రిల్లర్ జోనర్‌లో వచ్చింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే కాస్త అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను రూపొందించి ఆగస్టు 2వ తేదీన తీసుకొచ్చారు.

Allu Sirish Starrer Buddy Movie Digital Streaming Preponed By Netflix

డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'బడ్డీ' మూవీ కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ మాత్రం రాలేదు. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆశించిన రీతిలో దక్కలేదు. ఫలితంగా ఈ సినిమా థియేటర్లలో వారం రోజులు కూడా ఆడలేదు. ఫలితంగా నిర్మాతలకు నష్టాలు ఎదురయ్యాయి.

అల్లు శిరీష్ హీరోగా చేసిన 'బడ్డీ' సినిమాపై కాస్త బజ్ ఏర్పడడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎప్పుడో రివీల్ చేశారు. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఇక, తాజాగా స్ట్రీమింగ్ డేట్‌పై ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

Allu Sirish Starrer Buddy Movie Digital Streaming Preponed By Netflix

అల్లు శిరీష్ - సామ్ ఆంటన్ కలయికలో రూపొందిన 'బడ్డీ' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నెల లోపలే అంటే ఆగస్టులోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనిపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. మెడికో అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'బడ్డీ' మూవీని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇందులో గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ఆలీ నటించారు. హిప్ హప్ తమీజా మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Read more about: buddy allu sirish buddy ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X