OTT: ఓటిటిలో అల్లు హీరో సూపర్ నాచురల్ థ్రిల్లర్.. సినిమా ఎందులో? ఎప్పుడు చూడొచ్చంటే?
వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఓటిటిల ఆదరణ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇలా వరల్డ్ వైడ్ గా మంచి పాపులార్టీ ఉన్నటువంటి స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ ప్రతి వారం కూడా కొత్త కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లతో పలకరిస్తూ ఉంటాయి. ఇక మన దేశంలో కూడా పలు ఓటిటి సంస్థలు ఎప్పటికప్పుడు సాలిడ్ కంటెంట్ ని తీసుకొస్తూ ఉంటారు.
మరి మన దేశంలో మంచి పాపులారిటీ ఉన్నటువంటి స్ట్రీమింగ్ యాప్స్ లో వరల్డ్ నెంబర్ 1 సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. కాగా నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం కూడా పలు చిత్రాలు అనేక భాషల్లో వచ్చాయి. అలా తాజాగా వచ్చిన చిత్రాల్లో మెగా అల్లు హీరో నటించిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమా కూడా వచ్చింది. ఆ సినిమానే "బడ్డీ". హీరో అల్లు శిరీష్ చాలా కాలం కెరీర్ పరంగా గ్యాప్ తీసుకొని ఇద్దరు హీరోయిన్స్ గాయత్రి భరద్వాజ్ ప్రిషా సింగ్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సామ్ ఆంటోని దర్శకత్వం వహించాడు.

కాగా ఈ తరహాలో మరో సినిమా కూడా తమిళంలో వచ్చిన "టెడ్డీ" ఉంది. అయితే దర్శకుడు ఈ సినిమా నుంచి దాదాపు రీమేక్ అని చెప్పలేం కానీ అందులో టెడ్డీని తీసుకొని అందులో కోర్ పాయింట్ తో బడ్డీ తెరకెక్కించాడు. మరి ఇందులో ఆ టెడ్డి బేర్ చేసే శాలు ఫన్నీ సీన్స్ హైలైట్ గా నిలవగా తమిళ్ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తే తెలుగులో శిరీష్ చేసాడు. కాగా శిరీష్ కంటే ముందు ఈ చిత్రం మరో యువ హీరో చేయాల్సి ఉంది.
అతడే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న నటుడు సందీప్ కిషన్ కాగా తనతో ఈ చిత్రం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఈ తర్వాత శిరీష్ దగ్గరకి వస్తే తాను ఈ సినిమా చేసాడు. కానీ ఈ చిత్రం థియేటర్స్ లో పెద్ద సక్సెస్ ఏమి సాధించలేదు. ప్లాప్ గానే నిలిచిపోయిన ఈ చిత్రం పిల్లల వరకు నచ్చే ఛాన్స్ ఉంది. మరి పిల్లల కోసం ఓటిటిలో ఒక ఇంట్రెస్టింగ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ని చూపించాలి అనుకునేవారు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

ఈ వీకెండ్ లో ఒక లుక్ వేయవచ్చు. కాగా ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషలు తమిళ్, కన్నడ మలయాళ భాషల్లో కూడా వచ్చింది. మరి తమిళ్ లో వచ్చిన టెడ్డీ అయితే తమిళ్ సహా తెలుగులో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అది చూడని వారికి అయితే ఈ బడ్డీ కొంచెం నచ్చవచ్చు. లేదా ఆ సినిమా చూసినవారికి రెగ్యులర్ గానే అనిపించవచ్చు అని చెప్పాలి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని శిరీష్ బడ్డీ ట్రై చేస్తే బెటర్.


Click it and Unblock the Notifications











