ఆ క్రాసింగ్‌లో ఏం జరిగింది, ఓటీటీలోకి అమలాపాల్ సైకలాజికల్ థ్రిల్లర్ , ఎందులో అంటే?

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ మలయాళ ఇండస్ట్రీ. భారతీయ చిత్ర పరిశ్రమలోని అన్ని పరిశ్రమలలో ఈ తరహా కథలు తయారవుతున్నా.. మల్లూవుడ్‌ ఈ విషయంలో పీజీ చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలు అందుబాటులోకి రావడంతో మలయాళ సినిమాలు బాగా పాపులర్ అవుతున్నాయి. అక్కడ కొన్ని చిత్రాలు థియేటర్‌లోకి, మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా విలక్షణ నటి అమలాపాల్ నటించిన మూవీ ఓటీటీలో దిగనుంది.

జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కించుకున్న అమలాపాల్ తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పెళ్లయినా ఆమెకు ఆఫర్లు వెల్లువలా పోటెత్తుతూనే ఉన్నాయి. అమలాపాల్ లేటెస్ట్ మూవీ లెవల్ క్రాస్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసిఫ్ అలీ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించగా.. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందజేశారు. అంతేకాదు.. అమలాపాల్ ఈ సినిమాలో ఓ పాట కూడా అలరించింది. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేశ్ పి పిళ్లై ఈ సినిమాను నిర్మించారు.

amala paul Asif Ali malayalam thriller movie level cross ott release confirmed here s the details

మూడు నెలల క్రితం రిలీజైన ఈ సినిమా థియేటర్‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లెవెల్ క్రాస్.. రూ.2 కోట్ల లోపే వసూళ్లను రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. టైమ్ లూప్ పాయింట్, హీరోహీరోయిన్ల డ్యూయెల్ రోల్ కారణంగా స్క్రీన్ ప్లే అర్ధం కాక ప్రేక్షకులు తికమకపడ్డారు. సబ్జెక్ట్ బాగానే ఉన్నప్పటికీ.. కథను కనెక్ట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని క్రిటిక్స్ తమ రివ్యూలలో రాశారు. టెక్నికల్‌గా సినిమా బాగుందని విమర్శకులు ప్రశంసించారు.

శిఖా (అమలాపాల్) ఓ మానసిక వైద్యురాలు. మెంటల్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్న ఆమె.. ఓ రోజున డాక్టర్ జింకోను కలుస్తుంది. ఈ క్రమంలో శిఖా మరో ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఎడారిలో రైల్వే గేట్‌మెన్‌గా పనిచేస్తున్న రఘు (ఆసిఫ్ అలీ)కి చైతాలి పరిచయమవుతుంది. చైతాలి, రఘులనే పోలి ఉన్న శిఖా, జార్జ్ ఎవరు.. కొత్త ప్రపంచంలోని వారితో.. పాత ప్రపంచంలోని వారికి సంబంధం ఏంటి..? అన్నదే కథ.

amala paul Asif Ali malayalam thriller movie level cross ott release confirmed here s the details

థియేటర్‌లో ఫెయిలైన ఈ సినిమా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగింది. ఈ ఆదివారం అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్‌లో రిలీజైంది. లెవెల్ క్రాస్‌ని తెలుగు ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. తమిళ ప్రేక్షకులు మాత్రం ఆహా తమిళ్‌లో వీక్షించొచ్చు. మరి ఓటీటీలో అమలాపాల్ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: amala paul asif ali level cross
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X