సినిమా ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్ సరికొత్త ప్లాన్.. సినిమాల కోసం ఊహించని పెట్టుబడి!
డిజిటల్ మిడియా హడావుడి పెరిగిన తరువాత థియేట్రికల్ బిజినెస్ చాలా వరకు తగ్గింది అనే కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన జనాలు థియేట్రికల్ గా సినిమాలను చూసే ఆసక్తి తగ్గిందని కూడా అనుకుంటున్నారు. కానీ సరైన కంటెంట్ తో సినిమాలు వస్తే థియేటర్స్ లో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటాయని కూడా మరికొన్ని సినిమాలు రుజువు చేశాయి.
అయితే ఓటీటీ ప్రభావం మాత్రం సినిమాలపై పడుతోందని ఓ వర్గం వారి వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే థియేట్రికల్ గా కొన్ని యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలను జనాలు థియేట్రికల్ గా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఓటీటీ లో వచ్చాకా చూసుకుందాం అనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే మరోవైపు ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వారి సొంతంగానే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకుంటున్నారు.

గత రెండేళ్ళ కాలంలో నెట్ ఫ్లిక్స్ అయితే ఏడాదికి వందకు పైగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలాగే కొన్ని సినిమాలను థియేట్రికల్ గా కూడా విడుదల చేస్తున్నారు. కానీ అందులో సక్సెస్ రేట్ అయితే చాలా తక్కువగానే ఉంది. అమెజాన్ ప్రైమ్ త్వరలోనే థియేట్రికల్ బిజినెస్ లో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రతి ఏడాది కూడా వీలైనంత ఎక్కువ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
అందుకోసం ముందుగానే ఒక బడ్జెట్ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఒక 1 బిలియన్ డాలర్స్ సినిమాల కోసం ఖర్చుపెట్టబోతున్నట్లు సమాచారం. అందులో థియేటర్ సినిమాలు ఎక్కువగా ఉండబోతున్నాయట. సొంతంగా థియేటర్లలో విడుదల చేసుకుని మంచి ప్రాఫిట్స్ అందుకోవాలి అని అమెజాన్ ప్రయత్నం చేస్తుంది. ఆ రూట్లో ప్రయత్నాలు చేస్తే సొంతంగా ఓటీటీ హక్కులు ఉంటాయి అలాగే డిజిటల్ మీడియాలో సినిమాలకు ప్రాఫిట్స్ రావడమే కాకుండా ఇష్టం ఉన్నప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. ఇక థియేట్రికల్ గా సినిమాలు క్లిక్ అయితే మరిన్ని లాభాలు వస్తాయని అమెజాన్ ప్రైమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా చేస్తే పెట్టిన పెట్టుబడికి తప్పకుండా 15% నుంచి 20% వరకు ప్రతి సినిమాకు లాభం వచ్చేలా ఉంటుందని అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











