Don't Miss!
- Sports
INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!
- News
కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్: సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ. 3 లక్షలు
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
HIT 2 Movie OTT: ఆ ఓటీటీలో హిట్ 2.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే!
విలన్ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత చాలా ఏళ్లకు సోలో హీరోగా మారి.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. కెరీర్ ఆరంభం నుంచీ ప్రత్యేకతను చాటుకుంటోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో 'మేజర్'తో పాన్ ఇండియా విజయాన్ని ఖాతాలో వేసుకున్న అడివి శేష్.. ఇప్పుడు 'హిట్ ద సెకెండ్ కేస్' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
Singer Revanth: తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత.. ఇద్దరూ ఎలా ఉన్నారంటే!
ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'హిట్' సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఆరంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఈరోజే (డిసెంబర్ 2) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అనుకున్నట్లుగానే ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఎంతో ఆసక్తిని రేకెత్తించే కథాంశంతో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన సమచారం బయటకు వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డ్స్‌లో చూపించారు. ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. దీన్ని విడుదలైన యాభై రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంటే ఇది వచ్చే సంక్రాంతికి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్
అడివి శేష్ హీరోగా రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, తణికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. ఇక, ఈ మూవీని నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.