Game Changer: ఫేమస్ ఓటీటీలో గేమ్ చేంజర్.. అన్ని కోట్ల డీల్‌తో రామ్ చరణ్ రికార్డు

మెగా ఫ్యామిలీ సపోర్టుతోనే సినిమాల్లోకి ఎంటరైనా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లలో రాణించి చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హీరోగా ఎక్కువ శాతం హిట్లను సొంతం చేసుకున్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును అందుకున్నాడు.

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. ఇలా ఇప్పటి వరకూ దీనికి సంబంధించి 60 శాతానికి పైగానే టాకీ పార్టును పూర్తి చేసినట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Amazon Prime Bagged Ram Charan Starrer Game Changer Movie Digital Rights

సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన బిజినెస్‌ను కూడా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మూవీపై ఉన్న అంచనాలకు అనుకుణంగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ సినిమా డిజిటల్ రైట్స్ గురించి క్లారిటీ వచ్చేసింది.

Amazon Prime Bagged Ram Charan Starrer Game Changer Movie Digital Rights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక, ఈ మూవీ డిజిటల్ డీల్ రామ్ చరణ్ కెరీర్‌లోనే (RRR కాకుండా) హయ్యెస్ట్ అని తెలిసింది.

ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X