Veera Simha Reddy: ఆ ఓటీటీకి వీరసింహారెడ్డి హక్కులు.. బాలయ్య కెరీర్‌లో మరో రికార్డు
చాలా కాలం పాటు వరుసగా ఫ్లాపులు ఎదురవడంతో ఇబ్బందులు పడి.. గత ఏడాది వచ్చిన 'అఖండ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మూవీ తర్వాత ఆయనలో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే యాక్షన్ మూవీని చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ షూట్ రాయలసీమ ప్రాంతంలో జరుగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతున్న 'వీరసింహారెడ్డి' సినిమా హక్కుల కోసం పోటీ ఓ రేంజ్‌లో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో బాలయ్య సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని తాజాగా తెలిసింది. ఇందుకోసం సదరు సంస్థ కళ్లు చెదిరే మొత్తాన్ని అందజేసినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అది నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని తెలిసింది. తద్వారా ఆయన కెరీర్‌లో మరో అరుదైన రికార్డు వచ్చి చేరినట్లైంది.
బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











