Kushi: ఆ ఓటీటీ చేతికి విజయ్ దేవరకొండ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

'పెళ్లి చూపులు' అనే సినిమాతో సోలో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. విలక్షణమైన యాక్టింగ్‌కు తోడు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. అయితే, ఆరంభంలో మాదిరిగా ఇప్పుడు విజయ్ పెద్దగా విజయాలను అందుకోవడం లేదు. పైగా 'లైగర్'తో అతడు టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లను చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' అనే సినిమాలో నటిస్తోన్నాడు. ఇందులో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో పాటు పాటను విడుదల చేశారు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

Amazon Prime Bagged Vijay Deverakonda Kushi Digital Rights

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ఖుషి' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారమే ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాతనే దీన్ని స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని అంటున్నారు. ఈ డిజిటల్ హక్కుల కోసం సదరు సంస్థ కొన్ని కోట్ల భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది.

అదిరిపోయే కాంబినేషన్‌లో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X