RAVANASURA OTT: రవితేజ సినిమాకు రికార్డు రేటు.. ఓటీటీ రిలీజ్ అప్పుడేనా!

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. గత ఏడాది మూడు చిత్రాలతో వచ్చాడు. అందులో చివరి చిత్రం 'ధమాకా' భారీ హిట్ అయింది. ఆ తర్వాత అంటే ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే వారం రోజుల క్రితమే మాస్ మహారాజా రవితేజ 'రావణాసుర' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

స్టార్ హీరో రవితేజ ప్రధాన పాత్రలో సుధీర్ వర్మ రూపొందించిన చిత్రమే 'రావణాసుర'. ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఫలితంగా రవితేజ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించినట్లుగానే దక్కాయి. కానీ, ఆ తర్వాత టాక్ మారడంతో ప్రేక్షకుల నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. ఫలితంగా దీనికి కలెక్షన్లు క్రమంగా డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ వివరాలు లీకయ్యాయి.

Amazon Prime Spents Huge Amount for RAVANASURA Movie Rights

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'రావణాసుర' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 12.50 కోట్లుకు కొనుగోలు చేసినట్లు తాజాగా తెలిసింది. ఇది రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ డీల్ అని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన ఐదో వారంలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు సదరు సంస్థతో ఒప్పందం చేసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే.. ఈ మూవీ మే 2వ వారంలో స్ట్రీమింగ్ కాబోతుందని అంటున్నారు.

మాస్ హీరో రవితేజ - సుధీర్ వర్మ కలయికలో రూపొందిన 'రావణాసుర' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ మంచి రోల్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X