KGF2 OTT రిలీజ్ ఆరోజే.. బాక్సాఫీస్ జోరు కొనసాగుతుండగా విడుదలకు ప్లాన్.. కారణమేమిటంటే?
డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ స్టార్ హీరో యష్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'కేజీయఫ్ ఛాప్టర్ 1' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కేజీయఫ్ ఛాప్టర్ 2 గురువారం (ఏప్రిల్ 14) బాక్సాఫీసు ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో గురువారం విడుదలైంది. కేజీయఫ్ ఛాప్టర్ 2ను చూసేందుకు దేశ వ్యాప్తంగా అభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కేజీయఫ్ ఛాప్టర్ 2 సినిమా రిలీజ్ రోజే ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండవచ్చు అనే చర్చ కూడా మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే.

యశ్ హీరోగా
స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ కేజీయఫ్ ఛాప్టర్ 2ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. 19 ఏళ్ళ యంగస్టర్ ఎడిటర్ గా వ్యవహరించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో
తాజాగా కేజీయఫ్2 ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో తేలింది. గతంలో కేజీయఫ్ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కేజీయఫ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను 'జీ' సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.

మూడు వారాలకే
ఇక డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఫిగర్ ఎంతన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని థియేట్రికల్ విడుదల తర్వాత కేవలం మూడు వారాలకే అమెజాన్ విడుదల చేసింది, అది కూడా ఈ చిత్రం హిందీ థియేట్రికల్ బెల్ట్‌లో మంచి వసూళ్లను సాధిస్తున్నప్పుడు

రాధే శ్యామ్ విషయంలో
OTTలో కూడా పుష్ప సూపర్ హిట్‌గా మారడానికి ఈ ఎర్లీ రిలీజ్ ఉపయోగ పడింది. ఈ క్రమంలోనే రాధే శ్యామ్ విషయంలో కూడా అలాగే చేశారు. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదలైన మూడు వారాల తర్వాత అమెజాన్‌లో ప్రీమియర్ చేయబడింది.

మరో నెల రోజుల్లో
ఇక కేజీయఫ్ ఛాప్టర్ 2 చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం తెలుస్తోంది. మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే కేజీయఫ్ 2 సినిమా మరో నెల రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











