Amazon Prime Video చేతికి పొన్నియన్ సెల్వన్ హక్కులు.. ఎన్ని కోట్లు చెల్లించిందంటే? ఓటీటీలో ఎప్పుడంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు నమోదు చేస్తున్నది. రెండు భాగాలు తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ఫస్ట్ లుక్, ట్రైలర్ ఈ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచాయి. తాజా అంచనాలతో బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో చెల్లించిన మొత్తం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

అట్టహాసంగా ఆడియో వేడుక
పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రమోషన్స్ భారీగా ఊపందుకొన్నాయి. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను అట్టహాసంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సినిమా ఫంక్షన్‌కు రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ వేడుకలో తమిళ సినీ ప్రముఖులు, చిత్రంలో నటించిన తారలు భారీగా తరలివచ్చారు.

సన్ టెలివిజన్ చేతికి శాటిలైట్ హక్కులు
పొన్నియన్ సెల్వన్ క్రేజ్ పెరుగుతున్ననేపథ్యంలో భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టెలివిజన్ దక్కించుకొన్నది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ఇతర వేడుకల ప్రసార హక్కులు కూడా సన్ టీవీ చేతిలోనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకకు సంబంధించిన ప్రసారాన్ని సినిమా రిలీజ్‌కు సన్ టీవీ స్ట్రీమింగ్ చేయనున్నది.

అమెజాన్ ఎన్ని కోట్లు చెల్లించిందంటే?
ఇక డిజిటల్, ఓటీటీ ప్రసార హక్కుల విషయానికి వస్తే.. పొన్నియన్ సెల్వన్ సినిమాకు చెల్లించిన మొత్తం దక్షిణాది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా హక్కులను 125 కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. ఓటీటీకి సంబంధించి ఈ రేంజ్‌లో బిజినెస్ కావడం దక్షిణాదిలో రేర్ అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..
ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా విషయానికి వస్తే.. భారీ తారాగాణంతో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. అయితే సుమారు నెల రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పొన్నియన్ సెల్వన్‌లో తెర ముందు, తెర వెనుక
నటీనటులు: చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిషా, జయం రవి, కార్తీ, ప్రకాశ్ రాజ్, శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
డైలాగ్స్: జయమోహన్
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్,
సినిమాటోగ్రఫి: రవి వర్మన్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మన్
బ్యానర్: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-09-30


Click it and Unblock the Notifications











