Amazon Prime Video 70 వెబ్ సిరీస్, సినిమాలు ప్రకటించిన అమెజాన్.. ఏ సినిమాలు? ఎప్పుడంటే?
ఓటీటీలో టాప్ స్థానంలో కొనసాగుతున్న డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తన పరిధిని విస్తరించేందుకు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సంస్థ ముంబైలో మెగా ఈవెంట్‌ను నభూతో నభవిష్యత్ అనే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా ఈవెంట్ కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని సినీ స్టార్లను, మీడియాను భాగం చేసే ప్రయత్నం చేసింది. ముంబై ఈవెంట్‌లో ప్రకటించిన ప్రణాళిక వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ముంబై మెగా ఈవెంట్‌లో కరణ్ జోహర్, నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, రిషబ్ శెట్టి, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, విక్రమ్ కుమార్, లాంటి తారలు వేదికపైన ప్రత్యక్షమయ్యారు. ఇంకా ఎందరో సినీ తారలు వేదికపైన వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకొన్నారు. ఈవెంట్‌లో బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా మారారు. గాయకుడు సుఖ్‌బీర్ సింగ్ మ్యూజికల్ ఈవెంట్ అందర్నీ ఆకట్టుకొన్నది.

అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ వేదికపై తమ ప్లాన్ గురించి చెబుతూ రానున్న రోజుల్లో విడుదల చేస్తున్న 70 సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. ఈవెంట్‌లో అమెజాన్‌కు చెందిన ఇండియన్, గ్లోబల్ టీమ్ లీడర్ షిప్ సభ్యులు పాల్గొన్నారు. తమ సంస్థ చేపట్టబోయే ప్రణాళికలను మీడియా ముందుంచారు.

కాంతార 2, బీ హ్యాపీ, గుల్కంద, చీకటిలో, ది మెహతా బాయ్, సుబేదార్, బాక్ గర్ల్స్, దూత 2, ఉప్పు కప్పురంబు, డేరింగ్ పార్ట్‌నర్స్, ది రానా కనెక్షన్స్, రంగీన్, క్వాఫ్, మట్కా కింగ్, రెవల్యూషనరీస్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, ది ట్రైబ్, ఫాలౌట్, అరబియా కడలి, కంగువా, చందూ చాంపియన్, ఛోరి లాంటి ఒరిజినల్స్ వివరాలను వెల్లడించింది.

ముంబైలోని అమెజాన్ మెగా ఈవెంట్‌లో సమంత రుత్ ప్రభు తాను నటించిన సిటాడెల్, అలాగే నాగచైతన్య నటించిన దూత 2 వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఈవెంట్‌లో దిల్ రాజు, మృణాల్ థాకూర్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











