Don't Miss!
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Varasudu OTT: ఆ ఓటీటీలో విజయ్ సినిమా.. అన్ని రోజుల ముందే స్ట్రీమింగ్
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుని.. సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా హవాను చూపిస్తున్నాడు ఇళయదళపతి విజయ్. ఎప్పటికప్పుడు తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తోన్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా విస్తరించుకుంటోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఈ కోలీవుడ్ స్టార్ ఇప్పుడు 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని గ్రాండ్‌గా విడుదల అయింది.
నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!
తెలుగు, తమిళంలో రూపొందిన 'వారసుడు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, ఆంధ్రా, తెలంగాణలో మాత్రం దీన్ని జనవరి 14న విడుదల చేశారు. తమిళంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీనికి కూడా ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక, ఈ సినిమాకు టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు. అయినా ఈరోజు స్పందన మాత్రం ఓ రేంజ్‌లోనే ఉంది.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వారుసుడు' హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ విజయ్ సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం సదరు సంస్థ కొన్ని కోట్ల మొత్తాన్ని అందజేసినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, ఈ చిత్రాన్ని విడుదలకు యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని తెలిసింది. అయితే, తెలుగులో మాత్రం లేటుగా రిలీజ్ అవడంతో ఓటీటీలో ముందే రాబోతుందని అంటున్నారు.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!
విజయ్ నటించిన 'వారసుడు' మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇచ్చాడు.