OTT: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు ఫ్రీ ఆఫర్.. అందులో కీలక నిర్ణయం!
కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటీల హవా పెరిగింది. రాను రాను క్రమంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తమ సత్తా చాటుతున్నాయి. థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. విభిన్నమైన జోనర్లతో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అలా అనేక ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి.
ఇటీవల జియో సినిమా (Jio Cinema) ఇంటర్నేషనల్, హిందీ, తెలుగు సినిమాలతో దుమ్ములేపేందుకు ప్రయత్నిస్తుంటే దానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దానిపై అమెజాన్ ప్రైమ్ వివరణ ఇచ్చింది.

డిజిటల్ స్ట్రీమింగ్, ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ తన సబ్ స్క్రైబర్లకు సరికొత్త ఫోన్ ప్లాన్ ను అందించే ఆలోచనలో ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ అందించే ముంబైల్ ఫోన్ ప్లాన్ లను మరీ చౌకగా లేదా ప్రైమ్ సభ్యులకు పూర్తిగా ఉచితంగా అందించేందుకు రెడీ అయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఫోన్ సేవలను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అమెరికాలోని (USA) ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు తమ నెట్ వర్క్ ల ద్వారా మొబైల్ ఫోన్ కనెక్టివిటీని అందించడానికి వెరిజోన్, టీ-మొబైల్, AT&T, డిష్ లతో ఈ ఈ-కామర్స్, డిజిటల్ ఎంటర్టైన్ మెంట్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు అనేక మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తను మొదటగా బిజినెస్ పబ్లికేషన్ అయిన బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇక ప్రైమ్ మెంబర్ షిప్ సభ్యత్వం పొందిన వినియోగదారులకు బహుళ ప్రయోజనాలను అందించడానికి అమెజాన్ ప్రైమ్ ఫోన్ సేవలలో వ్యూహాలు రచిస్తోంది.
ఒకే ప్రైమ్ మెంబర్ షిప్ వినియోగదారులకు దాని ఈ-కామర్స్ పోర్టల్ లో ఉచితంగా, వేగవంతమైన డెలీవరీ యాక్సెస్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే స్ట్రీమింగ్ సేవలకు కట్టిన సబ్ స్క్రిప్షన్ ధరకు అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ రీడింగ్, అమెజాన్ గేమింగ్ వంటి మరెన్నో సేవలకు యాక్సెస్ అందించనుంది.
ఇదిలా ఉంటే ప్రైమ్ సబ్ స్క్రైబర్ లకు మొబైల్ కనెక్టివిటీని ఫ్రీగా, లేదా తక్కువ ధర అందించే ప్లాన్స్ వంటి వార్తలను అమెజాన్ ఖండించింది. ప్రైమ్ వినియోగదారులకు వైర్ లెస్ సేవలను అందించేందుకు అమెజాన్ తో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను వెరిజోన్, టీ-ముబైల్, డిష్, AT&T విడివిడిగా తిరస్కరించాయి.


Click it and Unblock the Notifications











