OTT వరుణ్ తేజ్, నాగచైతన్యలకు భారీ దెబ్బ కొట్టిన అమెజాన్ ప్రైమ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఇటీవల తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే చిత్రాలు, వెబ్ సిరీసులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తమ ఓటీటీలో భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నట్లు ప్రమోషన్స్ భాగంగా చెప్పేసుకుంది. అందులో స్టార్ హీరో పవన్ చిత్రం నుంచి అనుష్క చిత్రం వరకు బాగానే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే పలు సినిమాల స్టోరీలైన్స్ రివిల్ చేసింది. దీంతో టాలీవుడ్ యంగ్ హీరోలు వరుణ్ తేజ్, నాగచైతన్యలకు ప్రైమ్ వీడియో భారీ దెబ్బకొట్టినట్లైంది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

యంగ్ హీరోలు హిట్ కోసం...:టాలీవుడ్ యంగ్ హీరోలు నాగచైతన్య, వరుణ్ తేజ్ ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్నారు. వీరు నటించిన ఏ చిత్రం కూడా ఇటీవల కాలంలో ఆకట్టుకోలేకపోయాయి. నాగచైతన్య చివరిగా కస్టడి చిత్రంతో బాక్సాఫీస్ వద్దకు వచ్చాడు. ఈ చిత్రం ఆయనకు డిజాస్టర్ గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ సంగతి కూడా అలాగే ఉంది. ఈఏడాది ఆపరేషన్ వాలంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Amazon Prime Video OTT Shock To Varun Tej Naga Chaitanya Matka Thandel Movies Full Details Here

తండేల్ తో బిజీ బిజీగా...:ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు హిట్ కోసం వేటలో పడిపోయారు. ఇక వీరు నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. వీరి కాంబోలో ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో హిట్ కొట్టేందుకు సిద్ధం అయ్యాడు చైతూ.

మట్కాతో మస్త్ బిజీగా...:మరోవైపు వరుణ్ తేజ్ కూడా మట్కా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీరి సినిమాలకు భారీ దెబ్బ కొట్టింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో మేకర్స్ టాలీవుడ్ టు బాలీవుడ్ మేకర్స్ తో ముంబైలో ఓ ఈవెంట్ ని నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమంలో తమ కొత్త ప్రాజెక్ట్స్ వివరాలను, అలాగే తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త వెబ్ సిరీస్, సినిమాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కానీ సినిమాల స్టోరీ లైన్స్ ని కూడా రివిల్ చేసింది.

Amazon Prime Video OTT Shock To Varun Tej Naga Chaitanya Matka Thandel Movies Full Details Here

స్టోరీ లైన్ రివిల్... :అందులో నాగచైతన్య తండేల్, మట్కా సినిమాల స్టోరీ లైన్ చెప్పేసింది. అయితే ఇందులో అసలు సమస్య ఏంటంటే... ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన సిరీస్, సినిమాలలో క్రిష్ ఆధ్వర్యంలో రూపొందుతున్న సిరీస్ అరెబియన్ కడలి, విజయ్ వర్మ నటిస్తున్న మట్కా కింగ్ సినిమాల స్టోరీలు తెలుగు పాన్ ఇండియన్ సినిమాలైనటు వంటి చైతూ తండేల్, వరుణ్ తేజ్ మట్కా కథలకు బాగా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలకు దెబ్బపడినట్లు అయిపోయింది.

ట్విస్ట్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్:హిట్ కోసం పరితపిస్తున్న ఈ కుర్ర హీరోల సినిమాలు... మరో రెండు సినిమాలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X