Padma Kasturirangan: అమెజాన్ ప్రైమ్ వీడియోలో నయా అప్‌గ్రేడ్..

గ్లోబల్ ఓటిటి ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ కు ప్రత్యేక స్థానం ఉంది. విభిన్న కంటెంట్ ను అందిస్తున్న ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ దూసుకు వెళ్తుంది. ఇండియాలో నెంబర్ వన్ ఓటిటి ఛాయిస్ గా అమెజాన్ నిలిచింది . ఈ క్రమంలో సౌత్ కంటెంట్ పై ఫోకస్ పెడుతూ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా ఈ సంస్థ తమ ఉద్యోగిని సౌత్ ఇండియా ఒరిజినల్ కు కొత్త హెడ్గా నియమించింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సౌత్ ఇండియా ఒరిజినల్ కొత్త హెడ్ గా పద్మ కస్తూరి రంగన్ (Padma Kasturirangan)ను నియమించారు. గత రెండేళ్లుగా ఈమె అమెజాన్ ప్రైమ్ లో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పద్మ కస్తూరికి ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ ఇండియా ఒరిజినల్ హెడ్గా నియమించారు. కస్తూరి అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిలిం కోర్స్ చేసింది. ఆ తర్వాత హైదరాబాదులోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో జాయిన్ అయింది.

Amazon Prime Video Promotes Padma Kasturirangan to Lead South India Originals

అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో కీలక బాధ్యతలో నిర్వహించింది. ఆ తర్వాత ఓ ప్రముఖ మీడియా హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ లో హెడ్ గా కీలక బాధ్యతలు నిర్వహించింది. 'తమడ మీడియా ప్రైవేట్ లిమిటెడ్', 'అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా'తో సహా అనేక ఇతర ప్రసిద్ధ సంస్థలతో కలిసి పనిచేశారు. అనంతరం ప్రైమ్ వీడియోలో చేరిన తరువాత ఎన్నో మార్పులు చేసింది. పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు, షోస్ నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న 'ది రానా దగ్గుబాటి షో'డిజైన్ లో ఆమె కీలకంగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా పద్మ కస్తూరి రంగన్ మాట్లాడుతూ.. ప్రైమ్ వీడియోలో సౌత్-ఇండియా ఒరిజినల్స్ అధినేతగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తాను రెండు సంవత్సరాల క్రితం ప్రైమ్ వీడియోలో చేరాననీ, అద్భుతమైన తెలుగు స్లేట్‌ను రూపొందించడానికి అద్భుతమైన సృష్టికర్తలతో కలిసి పని చేసే అవకాశం తన లభించిందని అన్నారు.

రాబోయే రోజుల్లో తమ నుంచి సూపర్ థ్రిల్లింగ్ సిరీస్ లు, కార్యక్రమాలు వస్తాయని, తమిళం,తెలుగులో మంచి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు.ప్రేక్షకులకు ఆకర్షణీయమైన, వినోదభరితమైన కంటెంట్ ఇవ్వబోతున్నాం. అలాగే తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన నిఖిల్ మధోక్, గౌరవ్ గాంధీ, జేమ్స్ ఫారెల్ లకు థ్యాంక్యూ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X